Draupadi Murmu AP Tour: సీఎం జగన్ నివాసానికి చేరుకున్న ఎన్టీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము, విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికిన వైసీపీ ఎంపీలు
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము.. మంగళవారం ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్న ప్రాంతంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ద్రౌపది ముర్ముకు విమానాశ్రయంలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, మార్గాని భరత్, గోరంట్ల మాధవ్ స్వాగతం పలికారు.
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము.. మంగళవారం ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్న ప్రాంతంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ద్రౌపది ముర్ముకు విమానాశ్రయంలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, మార్గాని భరత్, గోరంట్ల మాధవ్ స్వాగతం పలికారు. ఆమెకు గిరిజన సంప్రదాయంలో ఎంపీలు ఘన స్వాగతం అందించారు. అనంతరం ఎయిర్‌పోర్టు నుండి ద్రౌపది ముర్ము రోడ్డు మార్గంలో విజయవాడుకు బయలుదేరారు. ఇక, ఆమె వెంట కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా ఉన్నారు.
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం వైఎస్ జగన్ నివాసానికి చేరుకున్నారు. సీఎం వైఎస్ జగన్‌తో మర్యాద పూర్వక భేటీ అయ్యారు. అనంతరం సీఎం నివాసం నుంచి సీకే కన్వెన్షన్‌కి సీఎం వైఎస్ జగన్, ద్రౌపది ముర్ము, కిషన్ రెడ్డి వెళ్లనున్నారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న గిరిజన మహిళ ద్రౌపది ముర్ముకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఘన స్వాగతం. గన్నవరంలోని విమానాశ్రయంలో ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, మార్గాని భరత్, గోరంట్ల మాధవ్ స్వాగతం పలికారు.
— YSR Congress Party (@YSRCParty) July 12, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 12, 2022 04:22 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

