Buddha Venkanna: విజయసాయిరెడ్డి రాజీనామాపై టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన కామెంట్.. ఇదంతా జగన్‌ ఆడుతున్న డ్రామా అని ఫైర్, దేశం విడిచి వెళ్లేందుకు అనుమతివ్వకూడదని డిమాండ్

విజయసాయిరెడ్డి రాజీనామా నిర్ణయంపై టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదంతా జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి కలిసి ఆడుతున్న డ్రామా అన్నారు.

Buddha Venkanna: విజయసాయిరెడ్డి రాజీనామాపై టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన కామెంట్.. ఇదంతా జగన్‌ ఆడుతున్న డ్రామా అని ఫైర్, దేశం విడిచి వెళ్లేందుకు అనుమతివ్వకూడదని డిమాండ్
TDP Leader Buddha Venkanna Slams Vijayasai Reddy(X)

విజయసాయిరెడ్డి రాజీనామా నిర్ణయంపై టీడీపీ(TDP) నేత బుద్దా వెంకన్న(Buddha Venkanna) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదంతా జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి కలిసి ఆడుతున్న డ్రామా అన్నారు. వైఎస్ జగన్(Jagan) కి తెలిసే ఇదంతా జరుగుతుంది.. కేసులను పక్కదారి పట్టించడానికి ఆడుతున్న నాటకం అన్నారు.

చంద్రబాబుతో వ్యక్తిగత విభేదాలు లేవు అంటే నమ్మెంత పిచ్చోళ్లు కాదు ప్రజలు.. విజయసాయి రెడ్డి.. చంద్రబాబు(Chandrababu)ను అన్న ప్రతి మాట మాకు గుర్తుందన్నారు. చేసినవన్ని చేసి ఈరోజు రాజీనామా చేసి వెళ్లిపోతా అంటే కుదరదు అన్నారు.

ఆయన చేసిన భూకబ్జాలు, దోపిడీలు ఉత్తరాంధ్రలో చేసిన అరాచకాలు ప్రతి దానికి లెక్క తేలాలి అన్నారు. దేశం విడిచి వెళ్లేందుకు విజయసాయిరెడ్డికి CBI అనుమతి ఇవ్వకూడదు అన్నారు. ఎన్ని నాటకాలు ఆడినా ఎవరు క్షమించినా నేను మాత్రం విజయసాయిరెడ్డి(Vijaisai Reddy)ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని తేల్చిచెప్పారు బుద్దా వెంకన్న. జగన్ కి షాకిచ్చిన సైరా.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, వైసీపీ అధినేత గురించి ఏమన్నారంటే..

 TDP Leader Buddha Venkanna Slams Vijayasai Reddy

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jan 25, 2025 10:44 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).