Vijayawada Bypass Accident: వీడియో ఇదిగో.. విజయవాడ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. మంటల్లో చిక్కుకుని నలుగురు సజీవ దహనం..
Vijayawada Bypass Accident: విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డులో సోమవారం సాయంత్రం ఒక ఎలక్ట్రిక్ కారు (EV) అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టిన ఘటనలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కారు ఢీకొట్టిన మరుక్షణమే ఒక్కసారిగా మంటలు చెలరేగి, క్షణాల్లోనే వాహనం పూర్తిగా కాలిబూడిదైంది. ఈ ఘోర అగ్నిప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు.
నంబూరులో జరిగిన ఓ శుభకార్యానికి హాజరై తిరుగు ప్రయాణంలో విజయవాడ వైపు వస్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద గమనించి అప్రమత్తమైన స్థానికులు సహాయక చర్యలు చేపట్టగా, తీవ్ర గాయాలపాలైన మరో బాధితుడిని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని నున్న, నంబూరు గ్రామాల వాసులుగా గుర్తించారు. మృతులలో నున్న ప్రాంతానికి చెందిన కొమ్మారెడ్డి రాందేవ్ (39), ఆయన తల్లి అరుణ, ఒక చిన్నారితో పాటు నంబూరుకు చెందిన తిగురు విజయ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి అసలు కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Vijayawada Bypass Accident Video
విజయవాడ వెస్ట్ బైపాస్‌లో ఘోర ప్రమాదం..
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వెస్ట్ బైపాస్‌లో రోడ్డు ప్రమాదానికి గురై తగలబడిన ఈవీ (EV) కారు..
ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలైన ఒకరి పరిస్థితి విషమం..
ప్రమాదం జరిగిన వెంటనే క్షణాల్లో పూర్తిగా దగ్ధమైన విద్యుత్ కారు..
మృతులు నున్నకు చెందిన కొమ్మారెడ్డి రాందేవ్ (39), ఆయన తల్లి అరుణ..
ఒక చిన్నారి మరియు నంబూరుకు చెందిన తిగురు విజయగా గుర్తింపు..
నంబూరులో ఒక ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దారుణ ప్రమాదం చోటుచేసుకుంది..
#VijayawadaAccident #EVCarFire #WestBypass #RoadAccident #Vijayawada #Nunna #EVFire #TragicAccident #RTVTelugu #RTV
— RTV (@RTVnewsnetwork) October 12, 2026
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 12, 2026 07:08 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

