Visakhapatnam: వీడియో ఇదిగో, మద్యం ఇవ్వలేదని ఏకంగా వైన్‌ షాప్‌ను తగలబెట్టాడు, మంటల్లో పూర్తిగా కాలిపోయిన షాపు, రూ.1.5 లక్షల మేర ఆస్తి నష్టం

మద్యం ఇవ్వలేదని వైన్‌ షాప్‌ను తగలబెట్టిన ఘటన విశాఖపట్నం మధురవాడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మధు అనే ఓ వ్యక్తి మద్యం కోసం మధురవాడ ప్రాంతంలోని ఓ వైన్‌ షాప్‌ వద్దకు వచ్చాడు. అయితే అప్పటికే షాప్‌ మూతపడే సమయంలో కావడంతో సిబ్బంది అతనికి మద్యం ఇవ్వలేదు.

Visakhapatnam: వీడియో ఇదిగో, మద్యం ఇవ్వలేదని ఏకంగా వైన్‌ షాప్‌ను తగలబెట్టాడు, మంటల్లో పూర్తిగా కాలిపోయిన షాపు, రూ.1.5 లక్షల మేర ఆస్తి నష్టం
Man Sets Wine Shop On Fire After Staff Refuses To Sell Alcohol; Arrested

మద్యం ఇవ్వలేదని వైన్‌ షాప్‌ను తగలబెట్టిన ఘటన విశాఖపట్నం మధురవాడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మధు అనే ఓ వ్యక్తి మద్యం కోసం మధురవాడ ప్రాంతంలోని ఓ వైన్‌ షాప్‌ వద్దకు వచ్చాడు. అయితే అప్పటికే షాప్‌ మూతపడే సమయంలో కావడంతో సిబ్బంది అతనికి మద్యం ఇవ్వలేదు.

దీంతో వారితో వాగ్వాదానికి దిగిన అతను అక్కడి నుంచి వెళ్లిపోయి ఆదివారం సాయంత్రం పెట్రోల్‌ డబ్బాతో వచ్చిన అతను వైన్‌షాప్‌ లోపల, సిబ్బందిపైనా పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. దీంతో సిబ్బంది వెంటనే షాప్‌ బయటకు పరుగులు తీశారు. కానీ వైన్‌షాప్‌ మంటల్లో పూర్తిగా కాలిపోయింది. లోపల ఉన్న కంప్యూటర్‌, ప్రింటర్‌ ఇతర సామగ్రి కాలిపోయి రూ.1.5 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

Man Sets Wine Shop On Fire After Staff Refuses To Sell Alcohol; Arrested

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Nov 13, 2023 12:09 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).