Amit Shah Doctored Video Case: కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వీడియో మార్ఫింగ్ కేసు, సీఎం రేవంత్ రెడ్డికి సమన్లు జారీ చేసిన హోంశాఖ, మే 1న ఢిల్లీకి విచారణకు రావాలని ఆదేశాలు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వీడియో మార్ఫింగ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. మే 1న విచారణకు ఢిల్లీకి రావాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన ఉపయోగించిన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ను సైతం విచారణకు తీసుకురావాలన్నారు.
- Read in
- తెలుగు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వీడియో మార్ఫింగ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. మే 1న విచారణకు ఢిల్లీకి రావాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన ఉపయోగించిన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ను సైతం విచారణకు తీసుకురావాలన్నారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌కు చేరుకున్న ఢిల్లీ పోలీసులు సమన్లు అందజేశారు.హోం మంత్రిత్వ శాఖ, బీజేపీ పార్టీ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రేవంత్‌కు పోలీసులు సమన్లు పంపడం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ పోలీసుల ప్రత్యేక బృందం ఐటీ చట్టంలోని నిబంధనల ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.
అమిత్ షా ఈ నెల 23న తెలంగాణలో జరిగిన విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. అక్కడ మాట్లాడుతూ ‘‘బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందిన ఆ హక్కులను తిరిగి వారికే ఇచ్చేస్తాం’’ అని వ్యాఖ్యానించారు. దీన్ని కొంతమంది వక్రీకరించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్‌ను రద్దు చేస్తామని షా చెబుతున్నట్లుగా ఎడిట్ చేశారని బీజేపీ ఆరోపిస్తోంది.
Here's ANI News
Fake video of Union Home Minister Amit Shah | Telangana CM Revanth Reddy has been summoned to appear before Delhi Police's IFSO unit (Cyber Unit) on 1st May to join the investigation. He has been asked to appear with his mobile phone allegedly used for posting the fake video on X…
— ANI (@ANI) April 29, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 29, 2024 04:30 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

