Corona in AP: ఏపీలో గడచిన 24 గంటల్లో 208 మందికి కరోనా, అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 53 కొత్త కేసులు నమోదు

ఏపీలో గడచిన 24 గంటల్లో 32,630 కరోనా పరీక్షలు నిర్వహించగా, 208 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 53 కొత్త కేసులు నమోదు కాగా, కృష్ణా జిల్లాలో 32, గుంటూరు జిల్లాలో 19, నెల్లూరు జిల్లాలో 18 కేసులు వెల్లడయ్యాయి.

Corona in AP: ఏపీలో గడచిన 24 గంటల్లో 208 మందికి కరోనా, అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 53 కొత్త కేసులు నమోదు
Coronavirus outbreak | (Photo Credits: IANS)

ఏపీలో గడచిన 24 గంటల్లో 32,630 కరోనా పరీక్షలు నిర్వహించగా, 208 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 53 కొత్త కేసులు నమోదు కాగా, కృష్ణా జిల్లాలో 32, గుంటూరు జిల్లాలో 19, నెల్లూరు జిల్లాలో 18 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో నాలుగు కొత్త కేసులు గుర్తించారు. అదే సమయంలో 247 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,69,978 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,52,477 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,086 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,415కి పెరిగింది.

 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Nov 15, 2021 11:31 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).