Rekha Naik: మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందనే నన్ను పక్కన పెట్టారు.. బీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంపై రేఖా నాయక్ తీవ్ర అసంతృప్తి.. అగ్రవర్ణాలకే పదవులు కట్టబెడుతున్నారని విమర్శ
మూడోసారి గెలిస్తే మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే తనను పక్కన పెట్టారని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ మంగళవారం పేర్కొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంపై రేఖా నాయక్ స్పందించారు.
Hyderabad, Aug 22: మూడోసారి గెలిస్తే మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే తనను పక్కన పెట్టారని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ (Rekha naik) మంగళవారం పేర్కొన్నారు. బీఆర్ఎస్ (BRS) అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంపై రేఖా నాయక్ స్పందించారు. పార్టీ ప్రకటించిన ఖానాపూర్ అభ్యర్థి జాన్సన్ నాయక్ అసలు ఎస్టీనే (ST) కాదని ఆరోపించారు. ఖానాపూర్ లో తన సత్తా ఏమిటో చూపిస్తానని పరోక్షంగా పార్టీ అధిష్టానికి సవాల్ విసిరారు. పార్టీలో, ప్రభుత్వంలో అగ్ర వర్ణాలకే పదవులు కట్టబెడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేడు కాంగ్రెస్ పార్టీలోకి ఆమె చేరనున్నట్టు సమాచారం.
MLA Rekhanayak Join in Telangana congress | కాంగ్రెస్లోకి రేఖానాయక్ దంపతులు..! | 10TV News#brs #rekhanaik #telanganapolitics #tcongress #10tv pic.twitter.com/HMlRBEOOzD
— 10Tv News (@10TvTeluguNews) August 22, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 22, 2023 10:27 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

