Parliament Special Session 2023: ఆంధ్రప్రదేశ్‌ విభజన అంశంపై ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మండిపడిన కేటీఆర్, ఇంకెన్నిసార్లు మా అస్తిత్వాన్ని అవమానిస్తారని ఫైర్

ఈ రోజు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌ విభజన అంశంపై మాట్లాడిన విషయం తెలిసిందే.ఈ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.

Parliament Special Session 2023: ఆంధ్రప్రదేశ్‌ విభజన అంశంపై ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మండిపడిన కేటీఆర్, ఇంకెన్నిసార్లు మా అస్తిత్వాన్ని అవమానిస్తారని ఫైర్
Telangana IT Minister KTR (PIC @ FB)

ఈ రోజు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌ విభజన అంశంపై మాట్లాడిన విషయం తెలిసిందే.ఈ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటును ప్రధాని మోదీ అవమానించడం ఇదే తొలిసారి కాదని అన్నారు. తెలంగాణ మీద పదే పదే ప్రధానికి అదే అక్కసు ఎందుకని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. అమృతకాల సమావేశాలని పేరుపెట్టి.. విషం చిమ్మడం సంస్కారహీనమని అన్నారు. తెలంగాణ అంటేనే గిట్టనట్టు, పగబట్టినట్టు.. మా పుట్టుకను ప్రశ్నించడం పద్ధతేనా? అని మోదీ వ్యాఖ్యలను ఆక్షేపించారు.

తల్లిని చంపి బిడ్డను తీశారని అజ్ఞానం, అహంకారంతో ఇంకెన్నిసార్లు మా అస్తిత్వాన్ని అవమానిస్తారని దుయ్యబట్టారు. పోరాడి దేశాన్ని ఒప్పించి మెప్పించి.. సాధించుకున్న స్వరాష్ట్రం పట్ల ఎందుకంత చులకన భావం మీకని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య దేవాలయంలో ప్రతిసారి పనిగట్టుగొని మా ఆత్మగౌరవాన్ని గాయపర్చడం సబబు కాదని అన్నారు.

Here's KTR Tweet

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Sep 18, 2023 07:41 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).