మణికొండ అల్కాపూరి కాలనీలో విషాదకర ఘటన చేసుకుంది. అల్కాపూరి టౌన్ షిప్‌ గణేష్ ఉత్సవ కమిటీ లడ్డు వేలం పాటలో పాల్గొన్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్..ఆకస్మికంగా మృతిచెందాడు. ఆదివారం రాత్రి టౌన్‌షిప్‌ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కొనసాగిన‌ లడ్డు వేలం పాటలో శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నాడు. 15 లక్షల వరకు లడ్డు వేలం‌లో పాల్గొన్నాడు. అనంతరం స్నేహితుడు లడ్డూ కైవసం చేసుకోవడంతో గణనాథుడి వద్ద ఉత్సాహంగా డాన్స్‌లు చేశాడు. స్నేహితులతో కలిసి తీన్మార్‌ స్టెప్పులేశాడు. అయితే ఇంటికి వెళ్లిన తర్వాత గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. దీంతో కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు విషాదంలో మునిగిపోయారు.

షాకింగ్ వీడియో ఇదిగో, కొడుకు బర్త్‌డే పార్టీలో గుండెపోటుతో కుప్పకూలి తల్లి మృతి, భర్తతో కలిసి స్టేజ్ మీద ఉండగా...

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)