తెలంగాణలోని ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. పంట కోసం తీసుకున్న అప్పుకు వడ్డీ కింద కళ్యాణలక్ష్మి(Kalyana Laxmi) డబ్బులు జమ చేసింది బ్యాంకు సిబ్బంది.
ఆదిలాబాద్ - సిరికొండ మండలం లచ్చింపూర్(బి)కు చెందిన పెందూర్ సోంబాయికి ఆరుగురు కూతుర్లు.. అందులో రెండో కుమార్తె హీరాదేవికి గతేడాది వేసవిలో వివాహం చేసింది. కళ్యాణలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకోగా వచ్చిన చెక్కును బ్యాంకు(Crop Loan)లో వేయగా అప్పుకు వడ్డీ కింద రూ.60 వేలు జమ చేసుకుంది సిబ్బంది.
విషయం తెలుసుకున్న మహిళ బ్యాంకుకు వెళ్లి డబ్బులు అడగడంతో పంట అప్పు కోసం తీసుకున్న వడ్డీ కింద రూ.60 వేలు పట్టుకొని మిగతా రూ.40 వేలు ఆమె చేతిలో పెట్టారు. దీంతో కంటతడి పెట్టుకొని బ్యాంక్ నుండి వెళ్లిపోయిన సోంబాయి. విద్యార్థినిని చెప్పుతో కొట్టిన టీచర్... విషయం తెలుసుకుని టీచర్‌కు దేహశుద్ది చేసిన విద్యార్థిని తల్లిదండ్రులు, వీడియో ఇదిగో
Telangana Bank Deducts Kalyana Lakshmi Funds for Loan Interest
పంట కోసం తీసుకున్న అప్పుకు వడ్డీ కింద కళ్యాణలక్ష్మి డబ్బులు జమ చేసిన బ్యాంకు సిబ్బంది
ఆదిలాబాద్ - సిరికొండ మండలం లచ్చింపూర్(బి)కు చెందిన పెందూర్ సోంబాయికి ఆరుగురు కూతుర్లు.. అందులో రెండో కుమార్తె హీరాదేవికి గతేడాది వేసవిలో వివాహం చేసింది
కళ్యాణలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకోగా… pic.twitter.com/YScURC9kva
— Telugu Scribe (@TeluguScribe) January 25, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)