Bandi Sanjay: వృద్ధురాలి పాదాలకు చెప్పులు తొడిగిన బండి సంజయ్, సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన బీజేపీ తెలంగాణ, పెద్దలను గౌరవించండి అంటూ కామెంట్
ప్రజా సంగ్రామ యాత్ర పేరిట బండి సంజయ్ తెలంగాణలో యాత్ర సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాత్రలో భాగంగా ఆయన ఇటీవలే ఓ వృద్ధురాలి పాదాలకు చెప్పులు తొడిగారు. ఈ ఫొటోలను బుధవారం సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన బీజేపీ తెలంగాణ శాఖ వైరి వర్గాలకు కౌంటర్ ఇచ్చింది.
తెలంగాణ పర్యటనలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు చెప్పులు అందించిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌పై వైరి వర్గాలు పెద్ద ఎత్తున ట్రోలింగ్‌కు దిగిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలను ఖండించిన బండి సంజయ్.. పెద్దల చెప్పులు మోయడంలో తప్పేముందంటూ ఎదురు దాడికి కూడా దిగారు.ఇదిలావుంచితే, ప్రస్తుతం ప్రజా సంగ్రామ యాత్ర పేరిట బండి సంజయ్ తెలంగాణలో యాత్ర సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాత్రలో భాగంగా ఆయన ఇటీవలే ఓ వృద్ధురాలి పాదాలకు చెప్పులు తొడిగారు. ఈ ఫొటోలను బుధవారం సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన బీజేపీ తెలంగాణ శాఖ వైరి వర్గాలకు కౌంటర్ ఇచ్చింది. 'పెద్దలను గౌరవించండి. వారి దీవెనలు ఎల్లప్పుడూ మిమ్మల్ని వ్యతిరేకత నుంచి కాపాడతాయి' అంటూ ఓ కామెంట్‌ను జత చేసింది.
Respect your elders! Their blessings will always save you from negativity. pic.twitter.com/qULg7o5y3I
— BJP Telangana (@BJP4Telangana) August 24, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 24, 2022 07:09 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

