Telangana Elections 2024: వరంగల్ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా కడియం కావ్య, మిగతా మూడు స్థానాలపై కొనసాగుతున్న ఉత్కంఠ

వరంగల్ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా కడియం కావ్య పేరును ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య ఆదివారం కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ వారికి కండువా కప్పి ఆహ్వానించారు.

Telangana Elections 2024: వరంగల్ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా కడియం కావ్య, మిగతా మూడు స్థానాలపై కొనసాగుతున్న ఉత్కంఠ
Congress Flag (Photo-X/Congress)

వరంగల్ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా కడియం కావ్య పేరును ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య ఆదివారం కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ వారికి కండువా కప్పి ఆహ్వానించారు. అంతకుముందు కడియం కావ్యకు బీఆర్ఎస్ వరంగల్‌ లోక్‌సభ టికెట్‌ ఇవ్వగా.. ఆ పార్టీ నుంచి పోటీ చేసే ఉద్దేశం తనకు లేదంటూ ఆమె నిరాకరించారు. తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాలకుగానూ కాంగ్రెస్‌ ఇప్పటి వరకు 14 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌ స్థానాలకు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.

Here's News

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Apr 02, 2024 05:22 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).