తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన శ్రీకాంతచారి తల్లి శంకరమ్మ గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో గాంధీ భవన్‌లో ఆమె కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... శంకరమ్మకు పార్టీలో తగిన ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. శంకరమ్మ కుటుంబం రాష్ట్రానికి చేసిన త్యాగం కాంగ్రెస్ పార్టీ మరువదన్నారు. నల్గొండ జిల్లాకు చెందిన వందలాది మంది బీఆర్ఎస్ ముఖ్య నేతలు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు.పార్టీలో చేరిన అనంతరం శంకరమ్మ మాట్లాడుతూ..శ్రీకాంత చారి లాంటి 1000 మంది కాలి మాంసపు ముద్దలుగా మారి ఉడుకుతుంటే చూసి సోనియమ్మ తెలంగాణ ఇచ్చిందన్నారు.  వీడియో ఇదిగో, వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ, కోడె మొక్కులు చెల్లింపు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)