Corona in TS: తెలంగాణలో కొత్తగా 153 మందికి కరోనా, జీహెచ్ఎంసీ పరిధిలో 52 కొత్త కేసులు నమోదు

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 36,510 కరోనా పరీక్షలు నిర్వహించగా, 153 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 52 కొత్త కేసులు నమోదు కాగా, నల్గొండ జిల్లాలో 14, కరీంనగర్ జిల్లాలో 12, రంగారెడ్డి జిల్లాలో 11 కేసులు వెల్లడయ్యాయి.

Corona in TS: తెలంగాణలో కొత్తగా 153 మందికి కరోనా, జీహెచ్ఎంసీ పరిధిలో 52 కొత్త కేసులు నమోదు
A resident gets tested for coronavirus in the Liwan District in Guangzhou in southern China (Photo: PTI)

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 36,510 కరోనా పరీక్షలు నిర్వహించగా, 153 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 52 కొత్త కేసులు నమోదు కాగా, నల్గొండ జిల్లాలో 14, కరీంనగర్ జిల్లాలో 12, రంగారెడ్డి జిల్లాలో 11 కేసులు వెల్లడయ్యాయి. వికారాబాద్, నారాయణపేట, మెదక్, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్ జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 160 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,73,140 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,65,432 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,737 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,971కి పెరిగింది.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Nov 12, 2021 11:09 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).