Corona in TS: తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కేసులు, తాజాగా 190 మందికి కరోనా, జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 68 మందికి కోవిడ్
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 41,388 కరోనా పరీక్షలు నిర్వహించగా, 190 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 68 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 14, రంగారెడ్డి జిల్లాలో 13 కేసులు వెల్లడయ్యాయి.
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 41,388 కరోనా పరీక్షలు నిర్వహించగా, 190 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 68 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 14, రంగారెడ్డి జిల్లాలో 13 కేసులు వెల్లడయ్యాయి. వికారాబాద్, నిర్మల్, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 111 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,70,643 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,62,592 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,101 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,950కి పెరిగింది.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.26.10.2021 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/UHcRhVUU6X
— IPRDepartment (@IPRTelangana) October 26, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 27, 2021 11:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

