మిర్యాలగూడ వన్ పోలీస్ స్టేషన్‌లోనే హిజ్రాలు రెచ్చిపోయారు. రెండు గ్రూప్‌లుగా విడిపోయి తీవ్రంగా కొట్టుకున్నారు. ఆధిపత్య పోరులో భాగంగా ఓ వర్గం హిజ్రాలు పోలీసులను ఆశ్రయించారు. అలాగే ఆర్థిక లావాదేవీల విషయంలో హిజ్రాల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం తెలుసుకున్న మరో వర్గం స్టేషన్‌కు చేరుకుంది. రెండు వర్గాలు ఎదురెదురు పడటంతో తీవ్ర వాగ్వివాదం జరిగింది. పోలీస్ స్టేషన్‌లోనే రెండు వర్గాలు కొట్టుకున్నాయి. రాళ్లతో దాడి చేసుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఏం చేయాలో అర్థంకాక పోలీసులు తలలు పట్టుకున్నారు. పీఎస్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హిజ్రాలు తన్నుకున్న వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
Here's Video
మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో హిజ్రాల వీరంగం
ఆర్థిక లావాదేవీల విషయంలో హిజ్రాల మధ్య ముదిరిన వివాదం. రెండు వర్గాలుగా చీలి పోలీస్ స్టేషన్ ఆవరణలో కొట్టుకొని రాళ్లు రువ్వుకున్న హిజ్రాలు. pic.twitter.com/Y0gwSdVDef
— Telugu Scribe (@TeluguScribe) July 11, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)