తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ (Minister KTR) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సీఎం కేసీఆర్ వియ్యంకుడు, కేటీఆర్ మామ పాకాల హరినాథరావు (Pakala Harinatha rao) గుండెపోటుతో గురువారం మధ్యాహ్నం మృతి చెందారు. హరినాథరావు (Pakala Harinatha rao) కు మంగళవారం మధ్యాహ్నం 2.44 నిమిషాలకు గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు హుటాహుటీన గచ్చిబౌలిలోని AIG ఆసుపత్రికి తరలించారు. కాగా ఆరోగ్యం మరింత విషమించడంతో గురువారం 1.10 నిమిషాలకు పాకాల హరినాథరావు (Pakala Harinatha rao) మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
తన వియ్యంకుడు, మంత్రి కె. తారకరామారావు మామ పాకాల హరినాథరావు మృతిపట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని రాయదుర్గం వద్ద గల వారి నివాసానికి వెళ్ళి దివంగత హరినాథరావు భౌతిక కాయానికి సీఎం నివాళులర్పించారు.తండ్రిని పోగొట్టుకున్న దుఃఖంతో ఉన్న తమ కోడలు శైలిమను, శోకతప్తులైన కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి దంపతులు ఓదార్చారు. హరినాథరావు ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం కేసీఆర్ భగవంతున్ని ప్రార్థించారు.
Here's TS CMO Tweet
తండ్రిని పోగొట్టుకున్న దుఃఖంతో ఉన్న తమ కోడలు శైలిమను, శోకతప్తులైన కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి దంపతులు ఓదార్చారు. హరినాథరావు ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం కేసీఆర్ భగవంతున్ని ప్రార్థించారు. pic.twitter.com/vqtBHxYln2
— BRS TechCell (@BRSTechCell) December 29, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)