YS Sharmila Arrest: కేసీఆర్ సర్కారుకు వ్యతిరేకంగా మౌన దీక్ష, షర్మిలను అరెస్ట్ చేసిన పోలీసులు, బంగారు తెలంగాణలో డ్రగ్స్, మద్యం ఏరులై పారుతున్నాయని వైఎస్ఆర్టీపీ అధినేత్రి ఆరోపణలు
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ట్యాంక్ బండ్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయంటూ షర్మిల మౌనదీక్ష చేపట్టారు. ట్యాంక్ బండ్ పై రాణి రుద్రమదేవి విగ్రహం దగ్గర పార్టీ కార్యకర్తలతో కలిసి ఆమె దీక్షలో కూర్చున్నారు.
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ట్యాంక్ బండ్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయంటూ షర్మిల మౌనదీక్ష చేపట్టారు. ట్యాంక్ బండ్ పై రాణి రుద్రమదేవి విగ్రహం దగ్గర పార్టీ కార్యకర్తలతో కలిసి ఆమె దీక్షలో కూర్చున్నారు. నోటికి నల్ల గుడ్డ కట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. బంగారు తెలంగాణలో డ్రగ్స్, మద్యం ఏరులై పారుతున్నాయని ఆమె ఆరోపించారు. దానివల్ల మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. అయితే, ఈ మౌన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. షర్మిలను అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Here's ANI Video
#WATCH | Hyderabad, Telangana: YSRTP chief YS Sharmila taken into preventive custody by Police after she staged a protest at Tank Bund against state govt on atrocities against women. She was initially shifted to Bollaram police station and is now being shifted to her residence in… https://t.co/JXXved913b pic.twitter.com/ojQEbaFjsp
— ANI (@ANI) March 8, 2023
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, లైంగిక వేధింపులను నిరసిస్తూ.. ట్యాంక్ బండ్ వద్ద ఈరోజు మౌన దీక్ష నిర్వహించడం జరిగింది. ప్రజాస్వామ్యయుతంగా, ప్రశాంతంగా నిరసన తెలుపుతున్నా కేసీఆర్ సర్కారు పోలీసులతో అక్రమంగా అరెస్టు చేయించడం దుర్మార్గం.
1/2 pic.twitter.com/svHIA1nzDE
— YS Sharmila (@realyssharmila) March 8, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 08, 2023 06:43 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

