మెదక్ జిల్లా శివ్వంపేట మండలం బిక్య తండా గ్రామపంచాయతీ నాను తండాకు చెందిన అన్న తేజావత్ శంకర్(28) కూలీ పనులు చేస్తుండగా.. తమ్ముడు గోపాల్ గంజాయి తీసుకుంటూ జులాయిగా తిరుగుతాడు.
శంకర్ భార్య నాలుగేళ్ల క్రితం పుట్టింటికి వెళ్లిపోగా, కూలీ పనులు చేసే మహిళతో వివాహేతర సంబంధం ఉంది.. ఆ మహిళతోనే తమ్ముడు కూడా చనువుగా ఉండటంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగాయి.ఇటీవల గోపాల్ దొంగతనం కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు.
ఈ గొడవలను, మహిళతో వివాహేతర సంబంధం అన్ని మనసులో పెట్టుకున్న గోపాల్ శుక్రవారం అర్ధరాత్రి మద్యం మత్తులో నిద్రిస్తున్న అన్న శంకర్ కుడి చేతి వేలికి, ఎడమ కాలు వేలుకు రెండు విద్యుత్తు తీగలను చుట్టాడు.
స్విచ్ వేయడంతో షాక్ కొట్టి శంకర్ గట్టిగా అరవడంతో, తండ్రి నిద్ర లేచాడు.. తండ్రిని చూసిన గోపాల్ అక్కడి నుండి పారిపోగా, శంకర్ అప్పటికే మరణించాడు. ఏపీలో దారుణం..రెండో తరగతి బాలికపై వృద్దుడి లైంగిక వేధింపులు, తప్పించుకుని తల్లిదండ్రులకు చెప్పిన బాలిక..కేసు నమోదు
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)