IPL 2023: ధోని ఐపీఎల్ రిటైర్మెంట్‌పై తాజా ప్రకటన, వచ్చే ఏడాది ఐపీఎల్ కూడా ఆడతాడని తెలిపిన సురేశ్ రైనా, ఐపీఎల్-2023 గెలుస్తామని ధీమా
ఐపీఎల్ రిటైర్మెంట్‌పై చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడని సురేశ్ రైనా వెల్లడించాడు. ఇటీవలి కాలంలో రైనా.. ధోనిని కలిసినప్పుడు తాను ప్రస్తుతానికి రిటైర్మెంట్ గురించి ఆలోచన చేయట్లేదని తెలిపాడట
ఐపీఎల్ రిటైర్మెంట్‌పై చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడని సురేశ్ రైనా వెల్లడించాడు. ఇటీవలి కాలంలో రైనా.. ధోనిని కలిసినప్పుడు తాను ప్రస్తుతానికి రిటైర్మెంట్ గురించి ఆలోచన చేయట్లేదని తెలిపాడట. రిటైర్మెంట్‌పై తొందరేం లేదని, ఐపీఎల్-2023 గెలిచి ఇంకో ఏడాది ఆడతానని ధోని రైనాతో చెప్పాడట. ఈ విషయం ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.
ప్రస్తుతం ధోని రిటైర్మెంట్‌పై రైనా చెప్పిన విషయం ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తుంది. ఈ సీజన్‌లో కీలక మ్యాచ్‌లు జరగాల్సి ఉన్నప్పటికీ.. సీఎస్‌కే అభిమానులు అప్పుడే టైటిల్ గెలిచినట్లు ఫీలవుతున్నారు. ప్రస్తుత సీజన్‌లో సీఎస్‌కే ఆడిన 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఆ జట్టు తదుపరి ఆడబోయే 3 మ్యాచ్‌ల్లో రెండు గెలిచినా సునాయాసంగా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఒకవేళ రెండింటిలో ఒక మ్యాచ్ అటుఇటైనా మెరుగైన రన్‌రేట్ (0.409) ఉంది కాబట్టి ప్లే ఆఫ్స్ బెర్తుకు ఢోకా ఉండదు. ఇక్కడ ధోని సేనకు మరో అడ్వాంటేజ్ కూడా ఉంది. ఆ జట్టు ఆడాల్సిన 3 మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌లు టేబుల్ లాస్ట్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది. మే 10, 20 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. మరో మ్యాచ్ కేకేఆర్‌తో మే 16న జరుగనుంది.
(The above story first appeared on LatestLY on May 09, 2023 05:07 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

