Kagiso Rabada: అతి తక్కువ బంతుల్లో 300 వికెట్లు ప‌డ‌గొట్టిన‌ తొలి బౌలర్‌గా కగిసొ రబాడ రికార్డు, పాకిస్థాన్ లెజెండరీ పేసర్ వకార్‌ యూనిస్ రికార్డు బద్దలు కొట్టిన ద‌క్షిణాఫ్రికా పేస్ బౌల‌ర్‌

ద‌క్షిణాఫ్రికా పేస్ బౌల‌ర్‌ కగిసొ రబాడ టెస్టుల్లో అతి తక్కువ బంతుల్లో 300 వికెట్లు ప‌డ‌గొట్టిన‌ తొలి బౌలర్‌గా రికార్డుకెక్కాడు. త‌న టెస్టు కెరీర్‌లో రబాడ 11,817 బంతుల్లోనే 300 వికెట్ల మైలురాయిని చేరుకోవ‌డం విశేషం. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రబాడ ఈ అరుదైన ఫీట్‌ను అందుకున్నాడు.

Kagiso Rabada: అతి తక్కువ బంతుల్లో 300 వికెట్లు ప‌డ‌గొట్టిన‌ తొలి బౌలర్‌గా కగిసొ రబాడ రికార్డు, పాకిస్థాన్ లెజెండరీ పేసర్ వకార్‌ యూనిస్ రికార్డు బద్దలు కొట్టిన ద‌క్షిణాఫ్రికా పేస్ బౌల‌ర్‌
Kagiso Rabada becomes fastest to complete 300 Test wickets

ద‌క్షిణాఫ్రికా పేస్ బౌల‌ర్‌ కగిసొ రబాడ టెస్టుల్లో అతి తక్కువ బంతుల్లో 300 వికెట్లు ప‌డ‌గొట్టిన‌ తొలి బౌలర్‌గా రికార్డుకెక్కాడు. త‌న టెస్టు కెరీర్‌లో రబాడ 11,817 బంతుల్లోనే 300 వికెట్ల మైలురాయిని చేరుకోవ‌డం విశేషం. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రబాడ ఈ అరుదైన ఫీట్‌ను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో బంగ్లా బ్యాటర్ ముష్ఫికర్ రహీం వికెట్ తీయ‌డం ద్వారా ద‌క్షిణాఫ్రికా పేసర్‌ ఈ ఘనత సాధించాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు పాకిస్థాన్ లెజెండరీ పేసర్ వకార్‌ యూనిస్ (12,602 బంతుల్లో) పేరిట ఉండేది. 2015లో టెస్టు అరంగేట్రం చేసిన రబాడ ఇప్పటివరకు 65 టెస్టులు ఆడాడు. ఇందులో 302 వికెట్లు తీశాడు.

వరల్డ్ కప్ హీరో మొహమ్మద్ షమీ మళ్లీ వచ్చేస్తున్నాడు, గాయం నుంచి కోలుకుని నెట్స్ లో బౌలింగ్ చేస్తున్న వీడియో ఇదిగో..

అతితక్కువ బంతుల్లో 300 వికెట్లు తీసిన బౌలర్ల జాబితా

కగిసో రబడ (సౌతాఫ్రికా )*-11,817 బంతులు

వకార్ యూనిస్ (పాకిస్థాన్)-12,602 బంతులు

డేల్ స్టెయిన్ (సౌతాఫ్రికా )- 12,605 బంతులు

అలెన్ డొనాల్డ్ (సౌతాఫ్రికా )-13,672 బంతులు

దక్షిణాఫ్రికా తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌల‌ర్లు వీరే..

డేల్ స్టెయిన్ (93 మ్యాచ్ లు) -439 వికెట్లు

షాన్ పొలాక్ (108 మ్యాచ్ లు)- 421 వికెట్లు

మఖాయ ఎన్తిని (101 మ్యాచ్ లు)- 390 వికెట్లు

అలన్ డొనాల్డ్ (72 మ్యాచ్ లు)- 330 వికెట్లు

మోర్నీ మోర్కెల్ (86 మ్యాచ్ లు)-309 వికెట్లు

కగిసొ రబడ (65 మ్యాచ్ లు) - 302* వికెట్లు

(The above story first appeared on LatestLY on Oct 21, 2024 09:43 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).