Anakapalle Blast: అనకాపల్లి అచ్చుతాపురం ఫార్మా కంపెనీలో భారీ పేలుడు, ఇద్దరు కార్మికులు మృతి చెందినట్లుగా వార్తలు..

ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. సెజ్‌లోని సాహితీ ఫార్మాలో భారీ పేలుడు సంభవించింది. కంపెనీలో రియాక్టర్‌ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో అక్కడ మంటలు ఎగసిపడుతున్నాయి.

Anakapalle Blast: అనకాపల్లి అచ్చుతాపురం ఫార్మా కంపెనీలో భారీ పేలుడు, ఇద్దరు కార్మికులు మృతి చెందినట్లుగా వార్తలు..
Anakapalle Blast Video

ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. సెజ్‌లోని సాహితీ ఫార్మాలో భారీ పేలుడు సంభవించింది. కంపెనీలో రియాక్టర్‌ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో అక్కడ మంటలు ఎగసిపడుతున్నాయి. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు జరగడంతో భయాందోళనకు గురైన కార్మికులు అక్కడ నుంచి పరుగులు తీశారు. ఫార్మా సంస్థలో రియాక్టర్‌ పేలడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందినట్లు సమాచారం. మరికొందరు లోపల చిక్కుకున్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు.

అనకాపల్లి అచ్యుతాపురం సెజ్‌ సాహితీ ఫార్మాలో భారీ పేలుడు, ఇద్దరు కార్మికులు మృతి, మృతుల సంఖ్య పెరిగే అవకాశం

మూడు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. చుట్టుపక్కల పరిశ్రమలకు మంటలు అంటుకుంటాయని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. సాహితీ ఫార్మా చుట్టుపక్కలకు దట్టమైన పొగలు వ్యాపించాయి.ప్రమాదంలో సాహితీ ఫార్మా కంపెనీ దాదాపు 80 శాతం కాలిపోయింది. ఒక్కసారిగా ఎగసిన మంటలతో కార్మికులు భయంతో బయటకు పరుగులు తీసారు.ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

 

(The above story first appeared on LatestLY on Jun 30, 2023 01:40 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).