Konijeti Rosaiah Political Journey: కొణిజేటి రోశయ్య జీవితంలోని ప్రధాన ఘట్టాలు ఇవే, 70 ఏళ్ల పాటు కాంగ్రెస్ తోనే అనుబంధం, విద్యార్థినేత నుంచి సీఎం వరకూ ప్రయాణం..
రోశయ్య ప్రముఖ స్వాతంత్ర యోధుడు, కర్షక నాయకుడు ఎన్.జి.రంగా శిష్యులు. నిడుబ్రోలు లోని రామానీడు రైతాంగ విద్యాలయములో సహచరుడు తిమ్మారెడ్డితో బాటు రాజకీయ పాఠాలు నేర్చారు.
హైదరాబాద్, డిసెంబర్ 4: రోశయ్య ప్రముఖ స్వాతంత్ర యోధుడు, కర్షక నాయకుడు ఎన్.జి.రంగా శిష్యులు. నిడుబ్రోలు లోని రామానీడు రైతాంగ విద్యాలయములో సహచరుడు తిమ్మారెడ్డితో బాటు రాజకీయ పాఠాలు నేర్చారు. 1979లో టంగుటూరి అంజయ్య ప్రభుత్వంలో రవాణ, గృహనిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖలు, 1982లో కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలో హోం శాఖ, 1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, రవాణ, విద్యుత్తు శాఖలు, 1991లో నేదురుమల్లి జనార్ధనరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలు, 1992లో కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలకు మంత్రిగా పనిచేసారు. 2004, 2009లో వై.యస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వములో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ (ఆర్ధిక ప్రణాళిక)ను ఇప్పటికి 15 సార్లు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలో ప్రవేశపెట్టారు. 1995-97 మధ్యకాలంలో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపిసిసి) అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లో నరసరావుపేట నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు.
>> ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా పనిచేసిన కొణిజేటి రోశయ్య
>> 1933 జులై 4న గుంటూరు జిల్లా వేమూరులో జన్మించిన రోశయ్య
>> ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు కీలక శాఖలు నిర్వహించిన రోశయ్య
>> తమిళనాడు గవర్నర్‌గా పనిచేసిన రోశయ్య
>> సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా కొనసాగిన రోశయ్య
>> 1933 జులై 4న జన్మించిన రోశయ్య
>> కొణిజేటి రోశయ్య స్వస్థలం గుంటూరు జిల్లా వేమూరు
>> 2009 సెప్టెంబర్ 3 నుంచి 2011 జూన్ 25 వరకు సీఎంగా పనిచేసిన రోశయ్య
>> 2011 ఆగస్టు 31 నుంచి 2016 ఆగస్టు 30 వరకు తమిళనాడు గవర్నర్‌గా పనిచేసిన రోశయ్య
>> ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 15వ ముఖ్యమంత్రిగా పనిచేసిన రోశయ్య
>> ఉమ్మడి ఏపీలో సుదీర్ఘకాలం ఆర్థికమంత్రిగా పనిచేసిన రోశయ్య
>> ఉమ్మడి ఏపీలో 15సార్లు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రోశయ్య
>> 1968, 1974, 1980లో కాంగ్రెస్ తరఫున మండలికి రోశయ్య ఎన్నిక
>> తొలిసారి మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా సేవలు
>> చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్‌అండ్‌బీ, రవాణా శాఖ మంత్రిగా రోశయ్య సేవలు
>> కాంగ్రెస్ సీఎంల వద్ద పలు కీలక శాఖలు నిర్వహించిన రోశయ్య
>> 2004లో చీరాల నుంచి అసెంబ్లీకి ఎన్నికైన రోశయ్య
>> తమిళనాడు 31వ గవర్నర్‌గా పనిచేసిన రోశయ్య
>> 1968లో తొలిసారి మండలికి ఎన్నికైన రోశయ్య
>> రోశయ్య స్వాతంత్య్ర సమరయోధుడు, రైతు నేత ఎన్జీ రంగా శిష్యుడు
>> నిడుబ్రోలులో రాజకీయ పాఠాలు నేర్చుకున్న రోశయ్య
(The above story first appeared on LatestLY on Dec 04, 2021 09:47 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

