Andhra Pradesh: ప్రేమ పేరుతో బాలికపై టీడీపీ నేత లైంగిక వేధింపులు, సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యకు పాల్పడిన మైనర్ బాలిక, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన రాష్ట్ర మహిళా కమిషన్‌

సత్యాసాయి జిల్లాలో టీడీపీ నేత లైంగిక వేధింపులకు ఓ బాలిక బలైంది. కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం ఎర్రబెల్లి గ్రామంలో బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్యకు (Minor girl commits suicide) పాల్పడింది.

Andhra Pradesh: ప్రేమ పేరుతో బాలికపై టీడీపీ నేత లైంగిక వేధింపులు, సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యకు పాల్పడిన మైనర్ బాలిక, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన రాష్ట్ర మహిళా కమిషన్‌
Image used for representational purpose | (Photo Credits: Pixabay)

Satya Sai, Oct 6: సత్యాసాయి జిల్లాలో టీడీపీ నేత లైంగిక వేధింపులకు ఓ బాలిక బలైంది. కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం ఎర్రబెల్లి గ్రామంలో బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్యకు (Minor girl commits suicide) పాల్పడింది. ఫేస్‌ బుక్‌ ద్వారా పరిచయం చేసుకున్న టీడీపీ నేత రాళ్లపల్లి ఇంతియాజ్‌ (TDP leader in Satya Sais District) తనను లైంగికగా వేధించాడని, ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియోలో బాలిక తెలిపింది.

ప్రేమ పేరుతో బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఇంతియాజ్.. చెప్పినట్లు చేయకపోతే మార్ఫింగ్‌ ఫోటోలు ఆన్‌లైన్‌లో ఉంచుతానని బెదిరింపులకు దిగాడు. దీంతో వేధింపులు తట్టుకోలేక బాలిక ఆత్మహత్య చేసుకుంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కదిరి రూరల్‌ పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు.

యూఎస్‌లో కిడ్నాపైన భారత సంతతి 8 నెలల చిన్నారి సహా ఫ్యామిలీ మొత్తం మృతి, ఆయుధాలు కలిగిన వ్యక్తి దారుణంగా చంపేశాడని తెలిపిన పోలీసులు

టీడీపీ నేత లైంగిక వేధింపులకు బలైన బాలిక ఉదంతంపై రాష్ట్ర మహిళా కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ జిల్లా ఎస్పీతో రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ మాట్లాడారు. దర్యాప్తు వేగవంతం చేసి నిందితుడిపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో వరుసగా టీడీపీ నేతల లైంగిక వేధింపులకు కారణం చంద్రబాబు వెనకేసుకురావడమేనని వాసిరెడ్డి పద్మ అన్నారు. విజయవాడ వినోద్‌ జైన్‌ కేసు సమయంలోనే టీడీపీ నేతలకు చంద్రబాబు బుద్ధి చెప్పాల్సిందన్నారు. ఇలాంటి ఘటనలను మహిళా కమిషన్‌ సహించే ప్రసక్తే లేదన్నారు. కీచక టీడీపీ నేతలకు తగిన గుణపాఠం తప్పదని ఆమె హెచ్చరించారు.

(The above story first appeared on LatestLY on Oct 06, 2022 02:20 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).