Andhra Pradesh: వధువు శోభనం గదిలోకి రాగానే బెడ్ మీద నిర్జీవంగా వరుడు, భయంతో అత్తమామలకు చెప్పిన కొత్త పెళ్లికూతురు, అన్నమయ్య జిల్లాలో విషాద ఘటన

న్నమయ్య జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పెళ్లి జరిగి 12 గంటలు కూడా గడవక ముందే పెళ్లి కొడుకు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. కాగా శోభనం గదిలోనే వరుడు మృతి చెందడం కలకలం సృష్టించింది.

Andhra Pradesh: వధువు శోభనం గదిలోకి రాగానే బెడ్ మీద నిర్జీవంగా వరుడు, భయంతో అత్తమామలకు చెప్పిన కొత్త పెళ్లికూతురు, అన్నమయ్య జిల్లాలో విషాద ఘటన
Representational Image (Photo Credits: ANI)

Madanapalle, Sep 14: అన్నమయ్య జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పెళ్లి జరిగి 12 గంటలు కూడా గడవక ముందే పెళ్లి కొడుకు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. కాగా శోభనం గదిలోనే వరుడు మృతి చెందడం కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మదనపల్లెలో (Madanapalle) తులసీప్రసాద్‌, శిరీషకు పెద్దలు పెళ్లి చేయాలని నిర్ణయించారు. దీంతో, సోమవారం వీరికి పెళ్లి జరిగింది. కాగా, పెళ్లి రోజులు రాత్రి వారికి ఇరు కుటుంబాల పెద్దలు శోభనం జరిపాలని నిర్ణయించారు. అందుకు తగినట్టుగానే అన్ని ఏర్పాట్లు చేశారు.

ముంబైలో దారుణం, టాలీవుడ్ హీరోయిన్‌పై అత్యాచారానికి పాల్పడ్డ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌, ఏకాంతంగా ఉన్న వీడియోలతో బ్లాక్ మెయిల్, పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

కాగా, గదిలోకి ‍ముందుగానే వెళ్లిన తులసీప్రసాద్‌ బెడ్‌పై నిర్జీవంగా పడిపోయాడు. గదిలోకి వెళ్లిన నవ వధువు శిరీష్‌.. తులసీప్రసాద్‌ గదిలో పడిపో​యి (Newly married man found dead) ఉండటంతో టెన్షన్‌కు గురైంది. ఈ విషయాన్ని అత్తామామలకు చెప్పింది. వారు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. దీంతో తులసీప్రసాద్‌కు పరిశీలించిన వైద్యులు అప్పటికే అతడు మరణించినట్టు నిర్ధారించారు.

వరుడు పెళ్లి జరిగిన 24 గంటల్లోనే ఇలా మృతిచెందడంతో (man found dead on first night bed) రెండు కుటుంబాల్లో విషాదం నెలకింది. నవ వధువు శోకసంద్రంలో మునిగిపోయింది. అయితే, వరుడు తులసీప్రసాద్‌ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్టు తెలిపారు.

(The above story first appeared on LatestLY on Sep 14, 2022 04:17 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).