COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో 3 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి; రాష్ట్రంలో కొత్తగా 1,378 కోవిడ్ కేసులు నమోదు మరియు 1,139 మంది రికవరీ, 14,702కు చేరిన ఆక్టివ్ కేసుల సంఖ్య

రాష్ట్రంలో వ్యాక్సినేషన్ చురుగ్గా కొనసాగుతుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు సుమారు 3 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ వేసుకోగా, అందులో కోటి మందికి పైగా 18 నుంచి 44 ఏళ్ల వయసు వారు ఉన్నారని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది...

COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో 3 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి; రాష్ట్రంలో కొత్తగా 1,378 కోవిడ్ కేసులు నమోదు మరియు 1,139 మంది రికవరీ, 14,702కు చేరిన ఆక్టివ్ కేసుల సంఖ్య
Representational Image | (Photo Credits: PTI)

Amaravathi, September 2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా స్థిరంగా కొనసాగుతుంది. రోజూవారీ కోవిడ్ కేసులు సుమారు వెయ్యి నుంచి 15 వందల మధ్య నమోదవుతున్నాయి. ప్రతిరోజూ నమోదయ్యే కేసుల కంటే రికవరీ అవుతున్న వారి సంఖ్య తక్కువగా నమోదవుతుండటంతో ఆక్టివ్ కేసుల సంఖ్యలో గణనీయమైన మార్పులు కనిపించడం లేదు. మరోవైపు రాష్ట్రంలో వ్యాక్సినేషన్ చురుగ్గా కొనసాగుతుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు సుమారు 3 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ వేసుకోగా, అందులో కోటి మందికి పైగా 18 నుంచి 44 ఏళ్ల వయసు వారు ఉన్నారని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇక, ప్రస్తుతం ఏపిలో ప్రస్తుతం ఉన్న కోవిడ్ కేసులను ఒకసారి పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 59,566 మంది శాంపుల్స్‌ను పరీక్షించగా 1,378 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 20,16,680కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 20,13,785 గా ఉంది.

గడిచిన ఒక్కరోజులో తూర్పు గోదావరి జిల్లా నుంచి 242,  చిత్తూరు జిల్లా నుంచి 219 కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.

AP's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in AP

గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మరో 10 కోవిడ్ మరణాలు సంభవించాయి, దీంతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 13,877కు పెరిగింది.

మరోవైపు, నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 1,139 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 19,88,101 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 14,702 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నివేదించింది.

(The above story first appeared on LatestLY on Sep 02, 2021 05:15 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).