COVID in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 81 కరోనా కేసులు నమోదు, రాష్ట్రంలో చురుగ్గా కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ.. ఏపికి సంబంధించిన కరోనా అప్‌డేట్స్ ఇలా ఉన్నాయి

ఆదివారం నాటికి రాష్ట్రంలో 32,144 మంది టీకాలు వేయించుకున్నారు. అయితే రెండో రోజు సుమారు 27 వేల మందికి వ్యాక్సిన్ వేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకోగా సుమారు 13 వేల మంది మాత్రమే టీకాపై ఆసక్తి చూపారు. అనుకున్న దానికంటే 50 శాతం తక్కువగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరిగింది....

COVID in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 81 కరోనా కేసులు నమోదు, రాష్ట్రంలో చురుగ్గా కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ.. ఏపికి సంబంధించిన కరోనా అప్‌డేట్స్ ఇలా ఉన్నాయి
Coronavirus Outbreak. | (Photo Credits: Pixabay)

Amaravati, January 18: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ నివారణ వ్యాక్సిన్ చురుగ్గా కొనసాగుతోంది,  ఆదివారం నాటికి రాష్ట్రంలో 32,144 మంది టీకాలు వేయించుకున్నారు. అయితే రెండో రోజు సుమారు 27 వేల మందికి వ్యాక్సిన్ వేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకోగా సుమారు 13 వేల మంది మాత్రమే టీకాపై ఆసక్తి చూపారు. అనుకున్న దానికంటే 50 శాతం తక్కువగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరిగింది.

మరోవైపు రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి ఇంకా ఉంది, అయితే చాలా తక్కువ స్థాయిలోనే కేసులు నమోదవుతున్నాయి. సోమవారం వచ్చిన రిపోర్ట్ ప్రకారం రాష్ట్రంలో మరోసారి 100 లోపే కొత్త కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా  27,861  మంది శాంపుల్స్ ను పరీక్షించగా 81 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 8,86,066కు చేరింది.  వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 8,83,171గా ఉంది.

గడిచిన ఒక్కరోజులో  కడప నుంచి 19, చిత్తూరు నుంచి 15 మరియు గుంటూరు జిల్లా నుంచి 13 కేసులు నివేదించబడగా  మిగతా జిల్లాల నుంచి 10 లోపే కేసులు నమోదయ్యాయి.  జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.

AP's COVID Update:

Status of positive cases of #COVID19 in AP

గడిచిన ఒక్కరోజులో కొవిడ్ కారణంగా విశాఖ జిల్లా నుంచి ఒకరు మరణించారు. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 7141కు పెరిగింది.

మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 263 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 8,77,212 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 1,713 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

 

(The above story first appeared on LatestLY on Jan 18, 2021 06:36 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).