Andhra Pradesh Shocker: పాఠాలు చెబుతుండగా గుండెపోటు, పిల్లల ముందే కుప్పకూలిన టీచర్, ఆస్పత్రికి తీసుకువెళ్లేలోగానే మృతి

బాపట్ల జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. విద్యార్థులకు పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయుడు (Teacher) ఒక్కసారిగా గుండెపోటుతో (Heart attack) కుప్పకూలిపోయాడు.ఆ వెంటనే ప్రాణాలు కోల్పోయాడు.మృతుడు బాపట్ల జిల్లా పంగళూరుకు చెందిన పాలపర్తి వీరబాబుగా చెబుతున్నారు.

Andhra Pradesh Shocker: పాఠాలు చెబుతుండగా గుండెపోటు, పిల్లల ముందే కుప్పకూలిన టీచర్, ఆస్పత్రికి తీసుకువెళ్లేలోగానే మృతి
Heart-Attack (File Image)

Ongole, Mar 4: బాపట్ల జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. విద్యార్థులకు పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయుడు (Teacher) ఒక్కసారిగా గుండెపోటుతో (Heart attack) కుప్పకూలిపోయాడు.ఆ వెంటనే ప్రాణాలు కోల్పోయాడు.మృతుడు బాపట్ల జిల్లా పంగళూరుకు చెందిన పాలపర్తి వీరబాబుగా చెబుతున్నారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంకొల్లు గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు వీరబాబు (45) వేటపాలెం మండలం వాకావారి పాలెంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (Govt Primary School) లో విధులు నిర్వహిస్తున్నారు. యథావిధిగా శనివారం విధులకు హాజరైన వీరబాబు.. విద్యార్థులకు పాఠాలు చెబుతుండగానే గుండెపోటు రావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఇది గమనించిన విద్యార్థులు ఇతర ఉపాధ్యాయులకు సమాచారమిచ్చారు.

షాకింగ్ వీడియో, నడుస్తుండగానే గుండెపోటు, ఒక్కసారిగా అలా వెనక్కి కుప్పకూలిన మధ్య వయస్కుడు

వారు వెంటనే 108కి ఫోన్‌ చేసి సమాచారం అందజేశారు. వీరబాబుకి వైద్య సేవలు చేసిన సిబ్బంది అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్దారించారు. తమకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడి మృతిని కళ్లారా చూసిన విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ తోటి ఉపాధ్యాయుడు అకస్మాత్తుగా కుర్చీలోనే ప్రాణాలు విడవడంతో మిగతా ఉపాధ్యాయులు విషాదంలో మునిగిపోయారు. వీరబాబు మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు.

(The above story first appeared on LatestLY on Mar 04, 2023 03:28 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).