Andhra Pradesh Shocker: ప్రియుడిపై మోజు, భర్త అడ్డుగా ఉన్నాడని బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి, ఉరితాడుతో చంపేందుకు ప్రయత్నించిన ఇల్లాలు

విజయనగరం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం మోజులో కట్టుకున్న భర్తనే కడతేర్చాలని ప్రయత్నించింది ఓ కసాయి భార్య . భర్తకు బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి చంపాలని ప్రయత్నించింది ఇల్లాలు.

Andhra Pradesh Shocker: ప్రియుడిపై మోజు, భర్త అడ్డుగా ఉన్నాడని బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి, ఉరితాడుతో చంపేందుకు ప్రయత్నించిన ఇల్లాలు
Representational Image | (Photo Credits: IANS)

 Vizianagaram, July 7: విజయనగరం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం మోజులో కట్టుకున్న భర్తనే కడతేర్చాలని ప్రయత్నించింది ఓ కసాయి భార్య . భర్తకు బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి చంపాలని ప్రయత్నించింది ఇల్లాలు. భర్త నిద్రలోకి వెళ్లిన తర్వాత ప్రియుడితో కలిసి నైలాన్‌తాడు మెడకు బిగించి హత్య చేసేందుకు ప్రయత్నించింది.ఈ క్రమంలో భర్తకు తెలివివచ్చి కేకలు వేయడంతో అందరూ పారిపోయారు. బాధితుడు టూటౌన్‌ పోలీసులకు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఫిర్యాదు చేశాడు.

టూటౌన్‌ సీఐ సీహెచ్‌.లక్ష్మణరావు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక కుమ్మరివీధికి చెందిన కోటరాజు, శ్రీదేవి, పిల్లలు బుధవారం రాత్రి ఇంట్లో నిద్రకు ఉపక్రమించారు. శ్రీదేవికి చిన గోకవీధికి చెందిన గంధవరపు రఘుతో కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. ఈ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తప్పించాలనే ఉద్దేశంతో చంపాలని ప్రణాళిక వేసింది. ఇందులో భాగంగా ప్రియుడు నిద్రమాత్రలు కొని శ్రీదేవికి ఇచ్చాడు.అవి తీసుకుని శ్రీదేవి.. భర్త రాజుకు బుధవారం రాత్రి మటన్‌ బిర్యానీలో కలిపి తినిపించింది.

పిల్లలు కాదు కామాంధులు, మైనర్ బాలికను మేడ మీదకు లాక్కెళ్లి దారుణంగా అత్యాచారం, నిందితులంతా 12 నుంచి 14 ఏళ్ళ వారే..

బిర్యాని తిన్న భర్త రాజు నిద్రలోకి జారుకున్న తర్వాత రఘుకు ఫోన్‌ చేసింది.ప్రియుడుతో పాటు వరుసకు బావమరిది అయిన బొగ్గులదిబ్బకు చెందిన కేత శ్రీను సహాయం కోరి రూ. 20వేలకు ఒప్పందం కుదుర్చుకుని ఇద్దరూ వచ్చారు. వారు తెచ్చుకున్న నైలాన్‌ తాడును రాజు మెడకు బిగించి హత్య చేసేందుకు ప్రయత్నించగా మెలకువ వచ్చిన రాజు పెద్దగా కేకలు వేయడంతో అక్కడి నుంచి ఇద్దరూ పారిపోయా రు. ఈ మేరకు విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించడంతో రఘు, శ్రీను, శ్రీదేవిలను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో ఎస్సై షేక్‌ శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

(The above story first appeared on LatestLY on Jul 07, 2023 04:41 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).