CM Jagan Palnadu Tour: పల్నాడుకు కృష్ణమ్మ జలాలు అందించబోతున్నామని తెలిపిన సీఎం జగన్, వరికపుడిశెల ఎత్తిపోతల పథకం పనులకు శంకుస్థాపన చేసిన ఏపీ ముఖ్యమంత్రి

పల్నాటి సీమ రూపురేఖ­లను సమూ­లంగా మార్చే దిశగా అడుగులు వేస్తూ పల్నాడు జిల్లా మాచర్ల వద్ద వరికపుడిశెల ఎత్తిపోతల పథకం పనులకు సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా గత పాలకులు ప్రాజెక్టు చేపట్టారు

CM Jagan Palnadu Tour: పల్నాడుకు కృష్ణమ్మ జలాలు అందించబోతున్నామని తెలిపిన సీఎం జగన్, వరికపుడిశెల ఎత్తిపోతల పథకం పనులకు శంకుస్థాపన చేసిన ఏపీ ముఖ్యమంత్రి
CM YS Jagan Mohan Reddy (Photo-Twitter/APCMO)

పల్నాటి సీమ రూపురేఖ­లను సమూ­లంగా మార్చే దిశగా అడుగులు వేస్తూ పల్నాడు జిల్లా మాచర్ల వద్ద వరికపుడిశెల ఎత్తిపోతల పథకం పనులకు సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా గత పాలకులు ప్రాజెక్టు చేపట్టారు. ప్రస్తుతం అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే ఈ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశాం. ఏదైనా పని చేయాలంటే పాలకులకు చిత్తశుద్ధి ఉండాలి’’ అని సీఎం పేర్కొన్నారు.పల్నాడుకు కృష్ణమ్మ జలాలు అందించబోతున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

ఈ ప్రాజెక్టును దశలవారిగా మాచర్ల, వినుకొండ, ఎర్రగొండపాలెం వరకు తీసుకెళ్తాం. ఈ ప్రాజెక్టు ద్వారా తాగు, సాగునీరు అందింబోతున్నాం. పౌరుషాల పల్నాడు గడ్డను అభివృద్ధి గడ్డగా మారుస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలతో పాటు మహిళా సాధికారితకు కృషి చేశాం. రూ.2 లక్షల 40 వేల కోట్లు అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్లాయి. డీబీటీ నాన్‌డీబీటీ ద్వారా రూ.4 లక్షల 10వేల కోట్లు అందించాం. కోవిడ్‌ సమయంలోనూ సంక్షేమ పథకాలు అందించాం’’ అని సీఎం చెప్పారు.

ఏపీకి మిధిలీ తుపాను గండం, బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతున్న అల్పపీడనం, భారీ వర్షాలతో తమిళనాడు విలవిల

‘‘ఎంతటి కష్టకాలంలోనూ అభివృద్ధి సంక్షేమాన్ని ఆపలేదు. చంద్రబాబుకు ప్రజల సంక్షేమం పట్టదు. చంద్రబాబు పాలనలో మోసాలు, వెన్నుపోటు, అబద్ధాలే. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్కటైనా మంచి కార్యక్రమం చేపట్టలేదు. కుప్పం ప్రజలకే నీళ్లు ఇవ్వని చంద్రబాబు ఇతర ప్రాంతాలను బాగు చేస్తారా? కన్నతల్లికి అన్నం పెట్టనివాడు పిన్నతల్లికి బంగారు గాజులు కొనిస్తాడా?’’ అంటూ సీఎం జగన్‌ దుయ్యబట్టారు.

(The above story first appeared on LatestLY on Nov 15, 2023 01:45 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).