AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్‌ భేటీ, 57 కీలక అంశాలతో పాటు రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశం ముగిసింది. సచివాలయం మొదటి బ్లాక్‌లోని మంత్రివర్గ సమావేశ మందిరంలో జరిగిన ఈ భేటీలో 57 అంశాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్‌ భేటీ, 57 కీలక అంశాలతో పాటు రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం
CM-YS-jagan-Review-Meeting

Amaravati, Sep 7: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan) అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశం (AP Cabinet Meeting) ముగిసింది. సచివాలయం మొదటి బ్లాక్‌లోని మంత్రివర్గ సమావేశ మందిరంలో జరిగిన ఈ భేటీలో 57 అంశాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అలాగే పలు కీలక అంశాలపై కేబినెట్‌ భేటీలో చర్చించి నిర్ణయాలు తీసుకుంది. రూ. 1.26 లక్షల కోట్ల పెట్టుబడులకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

రాజ్‌భవన్‌లో క్రీడాకారులను సత్కరించిన గవర్నర్, భవిష్యత్తులో వారు దేశానికి మరెన్నో అవార్డులు అందజేయాలని ఆకాంక్షించిన బిశ్వభూషణ్ హరిచందన్

గ్రీన్ ఎనర్జీ లో రూ. 81 వేల కోట్ల పెట్టుబడుల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిన కేబినెట్‌.. 21వేల ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. వైఎస్సార్‌ చేయూత, దివ్యాంగులకు 4 శాతం ఉద్యోగాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లు, భావనపాడు పోర్టు విస్తరణకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ కేబినేట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాకు వెల్లడించారు. కేబినెట్ భేటీలో మొత్తం 57 ఆంశాలకు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు.

57 ఆంశాలు ఇవే..

►రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం

► గ్రీన్ ఎనర్జీలో రూ.81వేల కోట్ల పెట్టుబడుల ప్రాజెక్టులకు ఆమోదం

► 21వేల ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టులకు ఆమోదం

► ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా 195 మంది ఖైదీల విడుదలకు ఆమోదం

► వైఎస్సార్ చేయూతకు కేబినెట్ ఆమోదం.. ఈనెల 22నుంచి సీఎం జగన్ చేతుల మీదుగా కార్యక్రమం.

► ఆర్‌ అండ్ బీలో ఆర్కిటెక్‌  విభాగానికి 8 పోస్టుల మంజూరు

► దివ్యాంగులకు 4 శాతం ఉద్యోగాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లకు ఆమోదం

► భావనపాడు పోర్టు విస్తరణకు ఆమోదం

► సచివాలయంలో 85 అదనపు పోస్టులకు ఆమోదం

► ఒక్కో సచివాలయానికి రూ.20లక్షల నిధుల మంజురూకు ఆమోదం

►విశాఖపట్నం పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణానికి పరిపాలనా ఆమోదం

► కురుంపా ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజీలో సిబ్బంది నియామకానికి ఆమోదం

► నంద్యాల జిల్లా పాణ్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ఆమోదం

► ప్రతీ మండలంలో రెండు పీహెచ్‌సీలకు ఆమోదం

► పైడిపాలెం ప్రాజెక్ట్‌ నిర్వాసితులకు ఆర్‌ అండ్ ఆర్‌ ప్యాకేజీ

► అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ఆమోదం

(The above story first appeared on LatestLY on Sep 07, 2022 06:47 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).