AP Cabinet Meeting Highlights: డిసెంబర్ 29న రైతు భరోసా మూడో విడత డబ్బులు, ఏపీలో కొత్తగా 16 మెడికల్ కాలేజీల ఏర్పాటు, ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్, జగన్ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రి పేర్ని నాని
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీ (AP Cabinet meeting ends) ముగిసింది. ఈ సమావేశంలో రైతు భరోసా పథకం, ఇన్‌పుట్ సబ్సిడీ నేరుగా ఆర్టీజీఎస్ ద్వారా చెల్లింపులు చేసేందుకు కేబినెట్ ఆమోదం (AP Cabinet Meeting) తెలిపింది.
Amaravati, Dec 18: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీ (AP Cabinet meeting ends) ముగిసింది. ఈ సమావేశంలో రైతు భరోసా పథకం, ఇన్‌పుట్ సబ్సిడీ నేరుగా ఆర్టీజీఎస్ ద్వారా చెల్లింపులు చేసేందుకు కేబినెట్ ఆమోదం (AP Cabinet Meeting) తెలిపింది.
ఇళ్ల పట్టాల పంపిణీ, పక్కా ఇళ్ల నిర్మాణంపై చర్చ జరగడంతో పాటు, ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కార్పొరేషన్ ఏర్పాటు ఆర్డినెన్స్‌కు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఏపీ సర్వే అండ్ బౌండరీ చట్ట సవరణ, ఆంధ్రప్రదేశ్ పర్యాటక పాలసీని కేబినెట్ ఆమోదించింది. 6 జిల్లాల్లో వాటర్‌షెడ్ల అభివృద్ధి పథకం అమలుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ నిర్ణయాలను రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని (Perni Nani) మీడియాకు వెల్లడించారు. ఇన్‌పుట్ సబ్సిడీ నేరుగా ఆర్టీజీఎస్ ద్వారా చెల్లింపులు చేసేందుకు ఆమోదం తెలిపామని అన్నారు. అలాగే ఏ సీజన్‌లో పరిహారం ఆ సీజన్‌లోనే చెల్లించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
నివర్ తుపాను బాధితులకు ఈనెలాఖరులోగా పరిహారం చెల్లిస్తాం.చంద్రబాబు బకాయి పెట్టిన 1200 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించాం. ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కార్పొరేషన్ ఏర్పాటు ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపారు. కాగా ఏపీలో కొత్తగా 16 మెడికల్ కాలేజీల ఏర్పాటుకానున్నాయి. మొత్తం 27 మెడికల్ కాలేజీలకు రూ.16వేల కోట్ల నిధులు అందనున్నాయి.
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
ఏపీ సర్వే అండ్ బౌండరీ చట్ట సవరణకు ఆమోదం
ప్రతీ భూమికి సబ్ డివిజన్ ప్రకారం మ్యాప్ తయారు
ఆంధ్రప్రదేశ్ పర్యాటక పాలసీని ఆమోదించిన కేబినెట్
6 జిల్లాల్లో వాటర్‌షెడ్ల అభివృద్ధి పథకం అమలుకు కేబినెట్ ఆమోదం
కొత్త పర్యాటక విధానానికి ఆమోదం, పర్యాటక ప్రాజెక్టుల పెట్టుబడులకు ప్రోత్సాహకాలు
కోవిడ్ కారణంగా దెబ్బతిన్న పర్యాటక ప్రాజెక్ట్‌లకు రీస్టార్ట్ ప్యాకేజీకి ఆమోదం
రూ.198.05 కోట్ల పర్యాటక ప్రాజెక్ట్‌లకు రీస్టార్ట్ ప్యాకేజీ కింద ఆర్థికసాయం
హోటల్ రంగం రీస్టార్ట్ కోసం రూ.15 లక్షల వరకు రుణం
మొదటి ఏడాదికి 4.5 శాతం రాయితీతో వడ్డీ రుణాలు
సినీ పరిశ్రమకు కూడా రీస్టార్ట్ ప్యాకేజీ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం
రైతులకు రూ.719 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లింపుకు నిర్ణయం
రైతు భరోసా మూడో సీజన్‌కు కేబినెట్ ఆమోదం
డిసెంబర్ 29న రైతుల అకౌంట్‌లో రైతు భరోసా
పశుసంవర్ధకశాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో పోస్టుల భర్తీకి కేబినెట్ నిర్ణయం
పశుసంవర్ధకశాఖలో 147 ల్యాబ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ
పులివెందులలో ఏపీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్ ఏర్పాటు
ఆర్డినెన్స్ ద్వారా ఏపీఎంఈఆర్‌సీ ఏర్పాటుకు ఏపీ కేబినెట్ నిర్ణయం
1,100 సినిమా థియేటర్లకు రుణాలు, వడ్డీపై సబ్సిడీకి నిర్ణయం
సినీ పరిశ్రమకు కూడా రీస్టార్ట్ ప్యాకేజీ అమలు
ఏప్రిల్, మే, జూన్ కాలానికి పవర్ ఫిక్స్‌డ్ చార్జీల రద్దు
రాష్ట్రంలో సమగ్ర భూ సర్వేకు ఏపీ కేబినెట్ ఆమోదం
ల్యాండ్ సర్వే, బౌండరీ చట్టంలో 5 సవరణలకు కేబినెట్ ఆమోదం
3 ఏళ్లలో భూ సర్వే పూర్తి చేసి భూహక్కు పత్రాల జారీ
ల్యాండ్ రికార్డుల తయారీకి ఏపీ కేబినెట్ ఆమోదం
తిరుపతి వద్ద 40 ఎకరాల్లో సర్వే అకాడమీ ఏర్పాటు
ఏపీ ఐఐసీ ద్వారా ఏర్పాటు చేసే పరిశ్రమల పార్కుకు.. ఏర్పేడులో పరిహారం చెల్లింపులకు ఆమోదం
మార్చి నుంచి కోవిడ్ కారణంగా ఇబ్బందులు పడిన.. హోటళ్లు, రెస్టారెంట్లు, పర్యాటక ప్రాజెక్టులకు రీస్టార్ట్ ప్యాకేజీ
50 వేల నుంచి 15 లక్షల వరకు రుణ సదుపాయం కల్పించాలని నిర్ణయం
ఇందుకోసం 198 కోట్ల కేటాయింపు 6 మాసాలు మారటోరియం
ఎస్ జిఎస్టీ, స్టాంపు డ్యూటీ మినహాయింపు తదితర ప్రోత్సాహకాలు
400 కోట్లకు మించి పెట్టుబడులు పెడితే మెగా పరిశ్రమ హోదా
లీజు కాలాన్ని 33 నుంచి 99 ఏళ్లకు పెంచుతూ ఆమోదం
చింతలపూడి ఎత్తిపోతల పధకం కోసం నాబార్డు నుంచి 1931 కోట్ల రుణం కోసం జలవనరుల శాఖకు అనుమతి
ఏపీ అదనపు అడ్వొకేట్ జనరల్‌గా జాస్తి నాగభూషణం నియామకానికి ఆమోదం
(The above story first appeared on LatestLY on Dec 18, 2020 04:15 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

