Andhra Pradesh: రఘురామకృష్ణరాజుకు నోటీసులు ఇచ్చిన ఏపీ సీఐడీ, అధికారులపై మండిపడిన వైసీపీ రెబల్ ఎంపీ, పండగ రోజుల్లోనే తనకు నోటీసులు ఇవ్వడమేంటని మండిపాటు

హైదరాబాద్ గచ్చిబౌలిలోని రఘురామకృష్ణరాజు ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు మరోమారు వచ్చారు. ఈ నెల 17న విచారణకు హాజరుకావాలని రఘురామకు నోటీసులు (AP CID Notices to YSRCP Rebal MP) ఇచ్చారు. ఏపీ ప్రభుత్వంపై విద్వేషాలు రెచ్చగొట్టేలా రఘురామ (MP Raghurama Krishnam Raju) వ్యాఖ్యలు చేయడంతో గతంలో సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసింది.

Andhra Pradesh: రఘురామకృష్ణరాజుకు నోటీసులు ఇచ్చిన ఏపీ సీఐడీ, అధికారులపై మండిపడిన వైసీపీ రెబల్ ఎంపీ, పండగ రోజుల్లోనే తనకు నోటీసులు ఇవ్వడమేంటని మండిపాటు
YSRCP Rebal MP K Raghu Ramakrishna Raju (Photo-ANI)

Amaravati, Jan 12: హైదరాబాద్ గచ్చిబౌలిలోని రఘురామకృష్ణరాజు ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు మరోమారు వచ్చారు. ఈ నెల 17న విచారణకు హాజరుకావాలని రఘురామకు నోటీసులు (AP CID Notices to YSRCP Rebal MP) ఇచ్చారు. ఏపీ ప్రభుత్వంపై విద్వేషాలు రెచ్చగొట్టేలా రఘురామ (MP Raghurama Krishnam Raju) వ్యాఖ్యలు చేయడంతో గతంలో సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసింది. ఈ కేసులో గతంలో అరెస్టయిన రఘురామకృష్ణరాజు షరతులతో కూడిన బెయిల్‌తో బయటికి వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే ఈ నెల 17న విచారణకు హాజరుకావాలని రఘురామకృష్ణరాజుకు ఏపీ సీఐడీ పోలీసులు బుధవారం నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో అధికారులపై రఘురామకృష్ణరాజు చిందులు తొక్కారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏపీ పోలీస్‌ అధికారులపై నోరు పారేసుకున్నారు. సీఐడీ చీప్‌ సునీల్‌కుమార్‌ ఉన్మాది అంటూ వ్యాఖ్యానించారు. హిందువులకు సంక్రాంతి పండుగ చాలా ముఖ్యమైనదని ఆ పండగ రోజుల్లోనే తనకు నోటీసులు ఇవ్వడమేంటని ఆయన మండిపడ్డారు. సండ రోజుల్లో విచారణకు ఎందుకు రమ్మన్నారో వారికి తెలియాలని మండి పడ్డారు. కరోనా ప్రోటోకాల్స్ కు అనుగుణంగా విచారణకు హాజరవుతానని, నన్ను గతంలో హింసించిన సమయంలో కెమెరాలు ఎందుకు లేవని ఆయన అన్నారు. కాగా తన సొంత నియోజకవర్గం నరసాపురం పర్యటనకు రేపు వెళ్తున్నట్లు ఇప్పటికే రఘురామ ప్రకటించారు. రెండు రోజుల పాటు ఆయన నియోజకవర్గంలో ఉంటానని తెలిపారు.

(The above story first appeared on LatestLY on Jan 12, 2022 02:18 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).