AP Grama Sachivalayam Exam: నిమిషం లేట్ అయినా నో ఎంట్రీ, రేపటి నుంచి సచివాలయ పోస్టుల భర్తీ పరీక్షలు, ఏడు రోజుల పాటు 14 రకాల రాతపరీక్షలు

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఆదివారం నుంచి రాతపరీక్షలు (AP Grama Sachivalayam Exam) మొదలు కానున్నాయి. ఈసారి మొత్తం 16,208 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏడు రోజుల పాటు రోజుకు రెండేసి చొప్పున మొత్తం 14 రకాల రాతపరీక్షలను (AP Grama Sachivalayam 2020) నిర్వహించనున్నారు. రోజూ ఉదయం పది గంటలకు, మధ్యాహ్నం రెండున్నర గంటలకు పరీక్షలు ప్రారంభమవుతాయి. గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల భర్తీకి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని మున్సిపల్‌ శాఖ కమిషనర్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు.

AP Grama Sachivalayam Exam: నిమిషం లేట్ అయినా నో ఎంట్రీ, రేపటి నుంచి సచివాలయ పోస్టుల భర్తీ పరీక్షలు, ఏడు రోజుల పాటు 14 రకాల రాతపరీక్షలు
Representational Image (Photo Credits: PTI)

Amaravati, Sep 19: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఆదివారం నుంచి రాతపరీక్షలు (AP Grama Sachivalayam Exam) మొదలు కానున్నాయి. ఈసారి మొత్తం 16,208 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏడు రోజుల పాటు రోజుకు రెండేసి చొప్పున మొత్తం 14 రకాల రాతపరీక్షలను (AP Grama Sachivalayam 2020) నిర్వహించనున్నారు. రోజూ ఉదయం పది గంటలకు, మధ్యాహ్నం రెండున్నర గంటలకు పరీక్షలు ప్రారంభమవుతాయి. గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల భర్తీకి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని మున్సిపల్‌ శాఖ కమిషనర్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు.

విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. 16,208 సచివాలయ పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహిస్తున్నాం. కోవిడ్‌ నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. 2 వేల పరీక్ష కేంద్రాల్లో పరీక్షల కోసం ఏర్పాట్లు చేశాం. పరీక్ష కేంద్రంలో ఒక్కో గదిలో కేవలం 16 మందినే అనుమతిస్తామని తెలిపారు.కోవిడ్ ఉన్నవారి కోసం ప్రత్యేక ఐసోలేషన్ పరీక్ష కేంద్రాలు పెట్టాం. అభ్యర్థుల కోసం విశాఖ, విజయవాడలో సిటీ బస్సులను ఏర్పాటు చేస్తున్నాం. ఇన్విజిలేటర్లకు పీపీఈ కిట్లు ఇస్తున్నాం. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించం. పరీక్షకు వచ్చేవారికి స్క్రీనింగ్‌, శానిటేషన్‌ ఏర్పాటు చేస్తున్నాం' అని మున్సిపల్‌శాఖ కమిషనర్‌ విజయ్‌కుమార్‌ వివరించారు.

ఎన్‌ఈపీలో ప్రభుత్వ జోక్యం పరిమితం, ఎలాంటి ఒత్తిళ్లు లేని విధంగా జాతీయ విద్యా విధానం, ఎన్‌ఈపీ-2020 సమావేశంలో ప్రధాని మోదీ

కాగా కరోనా నేపథ్యంలో పరీక్ష రాసే అభ్యర్థులందరికీ థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహిస్తారు. ఉదయం పరీక్ష రాసేవారు 8 గంటల కల్లా, సాయంత్రం పరీక్ష రాసేవారు ఒంటి గంట కల్లా పరీక్ష కేంద్రం వద్ద రిపోర్ట్‌ చేయాలని అధికారులు తెలిపారు. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి మించి ఒక్క నిమిషం లేటుగా వచ్చినా పరీక్ష హాల్లోకి అనుమతించబోమన్నారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో ఉన్నప్పటికీ తెలుగు అనువాదం కూడా ఉంటుందని చెప్పారు. తప్పుగా గుర్తించిన జవాబులకు నెగిటివ్‌ మార్కులుంటాయన్నారు.

విజయవాడ, విశాఖపట్నంలలో శనివారం నుంచి సిటీ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయని రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఇన్‌చార్జ్‌ ఎండీ ఎంటీ కృష్ణబాబు తెలిపారు. మొత్తం 10,56,391 మంది పరీక్షలు రాస్తుండగా.. అందులో 6,81,664 మంది తొలిరోజునే పరీక్షకు హాజరవుతారు. శుక్రవారం సాయంత్రం వరకు 8,72,812 మంది హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. హాల్‌టికెట్‌లో ఫొటో స్పష్టంగా లేకున్నా, బ్లాక్‌ అయిన ఫొటో, చాలా చిన్న సైజులో ఫొటో, సంతకం లేని ఫొటో ఉంటే అభ్యర్థులు గెజిటెడ్‌ ఆఫీసర్‌తో సంతకం చేయించుకున్న మూడు ఫొటోలు వెంట తెచ్చుకోవాలి. హాల్‌టికెట్‌తోపాటు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు కూడా తప్పనిసరి.

ఓఎంఆర్‌ షీట్‌లో బ్లూ లేదా బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్‌తో మాత్రమే జవాబులు నింపాల్సి ఉంటుంది. పెన్సిల్, ఇంక్‌ పెన్, జెల్‌ పెన్‌తో నింపకూడదు.

కరోనా అనుమానిత లక్షణాలున్న వారు రాతపరీక్షకు హాజరయ్యేందుకు వీలుగా ప్రతి పరీక్ష కేంద్రంలో ఒక ఐసోలేషన్‌ రూమును అధికారులు ఏర్పాటు చేశారు. ఈ రూముల్లో ఇన్విజిలేటర్లకు పీపీఈ కిట్లను అందజేస్తారు. అభ్యర్థులకు మాస్కులు, హ్యాండ్‌ శానిటైజర్లు తప్పనిసరి. పరీక్ష సమయంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే పరీక్ష కేంద్రం అధికారుల దృష్టికి తెచ్చి ఐసోలేషన్‌ రూముకు వెళ్లాలి.

(The above story first appeared on LatestLY on Sep 19, 2020 04:55 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).