AP Minister Satyakumar Reply To KTR: గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటే గుర్తుకు వచ్చేది కబ్జా-కలెక్షన్-కరప్షన్-కమీషన్లే...కేటీఆర్ కు ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఘాటైన రిప్లై..
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఓటమి పై తెలంగాణా మాజీ మంత్రి కేటీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రం సత్యకుమార్ స్పందించారు. ఆయన ఎక్స్ ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ను విమర్శించారు.
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఓటమి పై తెలంగాణా మాజీ మంత్రి కేటీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రం సత్యకుమార్ స్పందించారు. ఆయన ఎక్స్ ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ను విమర్శించారు. ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ ట్వీట్ ఇలా ఉంది : "ధరణి పేరుతో తెలంగాణలో మీరు నడిపిన భూమాఫియా లాగానే ధర్మవరం లో గుడ్ మార్నింగ్ పేరుతో మీ భూభకాసుర మిత్రుడు ప్రభుత్వ, అసైన్డ్, ప్రైవేటు, ప్రజలు ఆస్తులను ఆక్రమించాడు. చివరికి చెరువులు కొండలను కూడా కబళించాడు. గుడ్ మార్నింగ్ అంటే ప్రజలకు గుర్తుకు వచ్చేది కబ్జా-కలెక్షన్-కరప్షన్-కమీషన్లే. ఫాంహౌస్ కు పరిమితమైన మీరు X (ట్విట్టర్) లో అడిగినా ధర్మవరం ప్రజలు సమాధానం చెబుతారు. మీ అవినీతిని ప్రశ్నిస్తూ నిర్మాణాత్మక విమర్శ చేసినందుకు ట్విట్టర్ లో 4 సం క్రితం నన్ను బ్లాక్ చేశారు. ఈ అవినీతి, అహంకారం, అసమర్థతే మిమ్మల్ని మీ ప్రియ మిత్రులు జగన్ కేతిరెడ్డిలను ఓడించాయి. ఒకే జాతి పక్షులు ఒకరికొకరు ‘సర్టిఫికేట్’ లు ఇచ్చుకుంటూ ఓదార్చుకోండి." అని సత్యకుమార్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఓటమి పై తెలంగాణా మాజీ మంత్రి @KTRBRS చిలక పలుకులు పలుకుతున్నారు..
ధరణి పేరుతో తెలంగాణలో మీరు నడిపిన భూమాఫియా లాగానే ధర్మవరం లో గుడ్ మార్నింగ్ పేరుతో మీ భూభకాసుర మిత్రుడు ప్రభుత్వ, అసైన్డ్, ప్రైవేటు, ప్రజలు ఆస్తులను ఆక్రమించాడు. చివరికి చెరువులు కొండలను… pic.twitter.com/Hb9wUTYuGB
— Satya Kumar Yadav (@satyakumar_y) July 10, 2024
(The above story first appeared on LatestLY on Jul 10, 2024 10:04 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

