COVID in AP: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 129 కోవిడ్ కేసులు నమోదు, ప్రస్తుతం 1289కి తగ్గిన ఆక్టివ్ కేసుల సంఖ్య, రాష్ట్రంలో మెరుగ్గా కొనసాగుతున్న వ్యాక్సినేషన్

మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మెరుగ్గా కొనసాగుతోంది. ఇక, రాష్ట్రంలో కేసుల విషయానికి వస్తే, గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 41,003 మంది శాంపుల్స్ ను పరీక్షించగా 129 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది....

COVID in AP: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 129 కోవిడ్ కేసులు నమోదు, ప్రస్తుతం 1289కి తగ్గిన ఆక్టివ్ కేసుల సంఖ్య, రాష్ట్రంలో మెరుగ్గా కొనసాగుతున్న వ్యాక్సినేషన్
Corona Vaccination (Photo-Twitter)

Amaravati, January 30: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహామ్మారి నియంత్రణ దిశగా సమర్థవంతమైన పోరాటం జరుగుతోంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మెరుగ్గా కొనసాగుతోంది. ఇక, రాష్ట్రంలో కేసుల విషయానికి వస్తే, గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 41,003 మంది శాంపుల్స్ ను పరీక్షించగా 129 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 8,87,720కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 8,84,825గా ఉంది.

గడిచిన ఒక్కరోజులో కృష్ణా జిల్లా నుంచి 26 కేసులు రాగా, గుంటూరు మరియు విశాఖ జిల్లాల నుంచి 17 చొప్పున, అలాగే కర్నూలు నుంచి 15, తూర్పు గోదావరి మరియు చిత్తూరు జిల్లాల నుంచి 12 చొప్పున  కేసులు నమోదయ్యాయి, జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.

AP's COVID Update:

Status of positive cases of #COVID19 in AP

గడిచిన ఒక్కరోజులో పశ్చిమ గోదావరి జిల్లాలో కొవిడ్ కారణంగా ఒక మరణం సంభవించింది.  తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 7153కు పెరిగింది.

మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 147 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 8,79,278 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 1,289 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

(The above story first appeared on LatestLY on Jan 30, 2021 07:28 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).