AP Unlock 4.0 Guidelines: సెప్టెంబర్ 30 వరకు ఏపీలో నో స్కూల్స్, అంతక్రియలకు 20 మందికి మాత్రమే, అన్‌లాక్ 4.0 మార్గదర్శకాలను విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్‌లాక్ 4.0 మార్గదర్శకాలను (AP Unlock 4.0 Guidelines) జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నెల 30 వరకు విద్యాసంస్థల బంద్ (Educational institutions Closed) కానున్నాయి. సెప్టెంబర్ 21 నుండి తొమ్మిదో తరగతి, టెన్త్, ఇంటర్ విద్యార్థులు పాఠశాలలు, కళాశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వగా, ఇందుకు తల్లిదండ్రుల రాత పూర్వక అంగీకారం తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Amaravati, Sep 7: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్‌లాక్ 4.0 మార్గదర్శకాలను (AP Unlock 4.0 Guidelines) జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నెల 30 వరకు విద్యాసంస్థల బంద్ (Educational institutions Closed) కానున్నాయి. సెప్టెంబర్ 21 నుండి తొమ్మిదో తరగతి, టెన్త్, ఇంటర్ విద్యార్థులు పాఠశాలలు, కళాశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వగా, ఇందుకు తల్లిదండ్రుల రాత పూర్వక అంగీకారం తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లకు 21 నుండి అనుమతి ఇచ్చారు. పీహెచ్‌డీ, పీజీ విద్యార్థులకు అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం (AP Govenment) పేర్కొంది.
సెప్టెంబర్ 20 నుండి పెళ్లిలకు 50 మంది అతిథులతో అనుమతి ఉంటుంది. అంతక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతి. సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ పార్క్‌లకు అనుమతి నిరాకరించారు. సెప్టెంబర్ 21 నుండి ఓపెన్ ఏర్ థియేటర్స్ కు అనుమతి ఇచ్చింది.
ఇక స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లకు 21 నుండి అనుమతి ఇచ్చారు. పీహెచ్‌డీ, పీజీ విద్యార్థులకు అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. సెప్టెంబర్ 21 నుంచి వంద మందికి మించకుండా... విద్యా, సామాజిక, స్పోర్ట్స్, మతపరమైన, రాజకీయ సమావేశాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
(The above story first appeared on LatestLY on Sep 07, 2020 04:45 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

