Gannavaram Politics: వల్లభనేని వంశీ దారెటు, గన్నవరం నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేసిన వైసీపీ నేత యార్లగడ్డ వెంకటరావు

గన్నవరం రాజకీయాలు మళ్లీ చర్చల్లోకి వచ్చాయి. తాజాగా వచ్చే ఎన్నికల్లో గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని వైసీపీ నేత యార్లగడ్డ వెంకటరావు ప్రకటించారు. గన్నవరం రాజకీయాల్లోనే తాను కొనసాగుతానని స్పష్టంచేశారు

Gannavaram Politics: వల్లభనేని వంశీ దారెటు, గన్నవరం నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేసిన వైసీపీ నేత యార్లగడ్డ వెంకటరావు
Yarlagadda Venkatarao and Vallabhanneni Vamsi (Photo-File Image)

గన్నవరం రాజకీయాలు మళ్లీ చర్చల్లోకి వచ్చాయి. తాజాగా  వచ్చే ఎన్నికల్లో గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని వైసీపీ నేత యార్లగడ్డ వెంకటరావు ప్రకటించారు. గన్నవరం రాజకీయాల్లోనే తాను కొనసాగుతానని స్పష్టంచేశారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తాను అమెరికా వెళ్లిపోతానని ప్రచారం చేశారని మండిపడ్డారు. ఈ రోజు వైసీపీ సీనియర్ నేత దుట్టా రామచంద్రారావుతో యార్లగడ్డ వెంకటరావు భేటీ అయ్యారు.

బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ లో రెండు గంటలకు వీరి సమావేశం కొనసాగింది. తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. తాను గన్నవరంలోనే ఉన్నానని, ఇక్కడి రాజకీయాల్లోనే కొనసాగుతానని చెప్పారు. నేను అజ్ఞాతవాసంలో ఉన్నా. రెండేళ్ల నుంచి రాజకీయంగా ఉన్న ఇబ్బందుల వల్ల కార్యకర్తలకు ఏం చేయలేకపోయాను” అని చెప్పారు. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారు? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేదు. వచ్చే ఎన్నికల్లో మాత్రం కచ్చితంగా పోటీ చేస్తానని చెప్పారు.

ఆయన నాకు గురువుతో సమానం, బోస్ వ్యాఖ్యలకు స్పందించిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, వేణుకి టికెట్ ఇస్తే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని తెలిపిన ఎంపీ

2019 ఎన్నికల్లో గన్నవరం అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకటరావు పోటీ చేసి ఓడిపోయారు. ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ విజయం సాధించారు. తర్వాత రాజకీయా పరిణామాల నేపథ్యంలో వంశీ వైసీపీకి మద్దతుగా వున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి వంశీకే టికెట్ ఇస్తారన్న ప్రచారం సాగుతోంది. ఈ ఎన్నికల్లో దుట్టా రామచంద్రారావుతో యార్లగడ్డ భేటీ ప్రధాన్యం సంతరించుకుంది.

(The above story first appeared on LatestLY on Jul 24, 2023 08:10 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).