Monsoon Rains: తెలుగు రాష్ట్రాలకు రానున్న 48 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం, ఎల్లో అలెర్ట్ జారీ

రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 48 గంటల్లో రాష్ట్రాల్లో భారి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈమేరకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

Monsoon Rains: తెలుగు రాష్ట్రాలకు రానున్న 48 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం, ఎల్లో అలెర్ట్ జారీ
Heavy rains. (Photo Credits: PTI)

రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 48 గంటల్లో రాష్ట్రాల్లో భారి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈమేరకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉరుములు మెరుపులు, గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, పలు జిల్లాల్లో ఈ వర్షప్రభావం ఎక్కువగా ఉండనున్నట్లు పేర్కొంది.

ఇక తెలంగాణలోని కొమరం భీమ్, మంచిర్యాల, నిర్మల్, నిజమాబాద్, జిగిత్యాల, సిరిసిల్ల , కరీంనగర్, భూపలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి జిల్లాలో విసృతంగా వర్షాలు పడే అవకాశం ఉంది.

(The above story first appeared on LatestLY on Jun 26, 2022 09:03 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).