CM Jagan on TDP & Janasena: ఖర్చు చేసే ప్రతీ రూపాయి భావితరాల కోసమే, పేదలకు ఈ స్థాయిలో దేశంలో ఏ ప్రభుత్వం ఖర్చుచేయలేదని తెలిపిన సీఎం జగన్

గిట్టని వాళ్లు జగన్‌ దుబారా చేస్తున్నాడంటూ మాట్లాడుతున్నారు. దేశంలో ఏ ప్రభుత్వం కూడా పేదలకు ఈ స్థాయిలో ఖర్చుచేయలేదు. ఖర్చు చేసే ప్రతీ రూపాయి భావితరాల కోసమే’’ అని సీఎం పేర్కొన్నారు.

CM Jagan on TDP & Janasena: ఖర్చు చేసే ప్రతీ రూపాయి భావితరాల కోసమే, పేదలకు ఈ స్థాయిలో దేశంలో ఏ ప్రభుత్వం ఖర్చుచేయలేదని తెలిపిన సీఎం జగన్
CM YS Jagan Mohan Reddy (Photo-Twitter/APCMO)

Vjy, Dec 21: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ఎనిమిదో తరగతి విద్యార్థులకు వరుసగా రెండో ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం ట్యాబ్స్‌ పంపిణీ చేపట్టింది. పేదింటి పిల్లలు అంతర్జాతీయ వేదికపై తమ సత్తాచాటాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యం మేరకు రూ.620 కోట్ల వ్యయంతో బైజూస్‌ ప్రీలోడెడ్‌ కంటెంట్‌ గల 4,34,185 ట్యాబ్స్‌ను 9,424 పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయనుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి నుంచి సీఎం జగన్‌.. గురువారం ఈ పంపిణీని ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు. విద్యార్థులకు మంచి చేస్తుంటే విష ప్రచారం చేస్తున్నారని, విద్యార్థులకు చెడు చేస్తున్నామంటూ తప్పుడు రాతలు రాశారంటూ ఎల్లో మీడియాపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ‘‘గిట్టని వాళ్లు జగన్‌ దుబారా చేస్తున్నాడంటూ మాట్లాడుతున్నారు. దేశంలో ఏ ప్రభుత్వం కూడా పేదలకు ఈ స్థాయిలో ఖర్చుచేయలేదు. ఖర్చు చేసే ప్రతీ రూపాయి భావితరాల కోసమే’’ అని సీఎం పేర్కొన్నారు.

 ఏపీ వాలంటీర్లకు గుడ్ న్యూస్, జనవరి నుంచి జీతం అదనంగా రూ.750 పెంచుతున్నట్లు ప్రకటించిన మంత్రి కారుమూరి

‘‘పిల్లలకు ఇచ్చే ఆస్తి చదువు మాత్రమే. విద్యార్థులకు మంచి చేస్తుంటే విష ప్రచారం చేస్తున్నారు. విద్యార్థులకు చెడు చేస్తున్నామంటూ తప్పుడు రాతలు రాశారు. పేద విద్యార్థులపై విషం కక్కొద్దని చెబుతున్నా. దిగజారుడు రాతలు రాయొద్దని చెబుతున్నా. పేద పిల్లల చేతిలో ట్యాబ్‌లు ఉంటే చెడిపోతారంట. పేద విద్యార్థులు ఇంగ్లీష్‌ మీడియంలో చదవద్దా?. పేద పిల్లలు ఇంగ్లీష్‌ మీడియం చదివితే తెలుగు అంతరించుకుపోతుందట. పేదలకు మంచి చేస్తుంటే మీకెందుకు ఈ కడుపుమంట. పేదల పిల్లలకు మంచి చేస్తుంటే కొందరు ఏడుస్తున్నారు. ఇటువంటి దిక్కుమాలిన రాజకీయాలతో యుద్ధం చేస్తున్నాం’’ అంటూ సీఎం జగన్‌ ధ్వజమెత్తారు.

(The above story first appeared on LatestLY on Dec 21, 2023 04:17 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).