Andhra Pradesh Shocker: అక్రమ సంబంధం వద్దన్న మామ, కావాలన్న కోడలు, ఆగ్రహంతో కోడలిని కత్తితో దారుణంగా పొడిచి చంపిన మామ, అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన నిందితుడు, తూర్పుగోదావరిజిల్లా మకిలిపురం మండలంలో ఘటన
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా మకిలిపురం మండలం మేడిచర్లపాలెం గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం వద్దని చెప్పినా వినకపోవడంతో కోడలిని మామ దారుణంగా హత్య (Man Murders daughter in Law) చేశాడు.
Malikipuram, July 31: ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా మకిలిపురం మండలం మేడిచర్లపాలెం గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం వద్దని చెప్పినా వినకపోవడంతో కోడలిని మామ దారుణంగా హత్య (Man Murders daughter in Law) చేశాడు. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన చొప్పల సత్యనారాయణకు ప్రియమణి (25) స్వయానా సోదరి కూతురు.
సోదరి కుటుంబం అండమాన్‌లో నివాసం ఉంటోంది. సత్యనారాయణ కుమారుడు విజయ్‌కుమార్ కూడా ఉపాధి కోసం అండమాన్ వెళ్లాడు. కుమారుడు ప్రియమణిని ఏడేళ్ల క్రితం అక్కడే వివాహం చేసుకుని స్వగ్రామానికి తీసుకు వచ్చాడు. అనంతరం ఆమెను ఇంటి దగ్గర వదిలేసి విజయ్‌కుమార్ ఉపాధి రీత్యా గల్ఫ్‌లో ఉంటున్నాడు. వారికి ఒక కొడుకు. ఈ నేపథ్యంలో కోడలు అడ్డదారులు (Illegal affair) తొక్కుతోందని మామ అనుమానించాడు.
తన తీరును మార్చుకోవాలని పదే పదే హెచ్చరించాడు. అయిన కోడలు వినకపోవడంతో ఆగ్రహించిన మామ కోడలు ప్రియమణిని సత్యనారాయణ దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. తన కోడలిని తానే తానే హత్య చేశానని పోలీసులకు తెలిపాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై నాగరాజు తెలిపారు.
(The above story first appeared on LatestLY on Jul 31, 2021 02:26 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

