Jagananna Videshi Vidya Deevena: జగనన్న విదేశీ విద్యా దీవెన నిధులు విడుదల చేసిన సీఎం జగన్, నిరుపేద విద్యార్థులు ఫారిన్ యూనివర్సిటీల్లో చదువుకునే దిశగా ఏపీ సర్కారు అడుగులు

ఏపీలోని పేద విద్యార్థులు సైతం ప్రపంచంలోని అగ్రశ్రేణి యూనివర్సిటీల్లో ఉన్నత విద్య అభ్య­సించేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం నిధులు (Jagananna Videshi Vidya Deevena) లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యాయి

Jagananna Videshi Vidya Deevena: జగనన్న విదేశీ విద్యా దీవెన నిధులు విడుదల చేసిన సీఎం జగన్, నిరుపేద విద్యార్థులు ఫారిన్ యూనివర్సిటీల్లో చదువుకునే దిశగా ఏపీ సర్కారు అడుగులు
Jagananna Videshi Vidya Deevena (Photo/APCMO)

Tadepalli, July 27: ఏపీలోని పేద విద్యార్థులు సైతం ప్రపంచంలోని అగ్రశ్రేణి యూనివర్సిటీల్లో ఉన్నత విద్య అభ్య­సించేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం నిధులు (Jagananna Videshi Vidya Deevena) లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యాయి. సీఎం జగన్‌ గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి నిధులు (jagananna videshi vidya deevena funds) విడుదల చేశారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. విద్యావ్యవస్థలో ఇది విప్లవాత్మక మార్పు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి మార్పులు లేవు. రాజకీయాలకు అతీతంగా విద్యార్థులకు అండగా ఉంటున్నాం.ఆంధ్రప్రదేశ్ లోని నిరుపేద విద్యార్థులు కూడా విదేశాలలోని యూనివర్సిటీలలో చదువుకునే గొప్ప అవకాశం కల్పించేందుకే విదేశీ విద్యాదీవెన పథకం తీసుకొచ్చినట్లు ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. ప్రతిభ, నైపుణ్యం ఉన్న మన విద్యార్థులకు మనమే అండగా ఉండాలనే సంకల్పంతో ఆర్థిక సాయం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతిభావంతులైన విద్యార్థులకు మెరుగైన అవకాశాలు లభించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు.

అవిశ్వాస తీర్మానంపై విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు, అంతా సవ్యంగా సాగుతున్నప్పుడు అవిశ్వాస తీర్మానం ఎందుకని వెల్లడి

దేశంలోని మరే రాష్ట్రంలోనూ ఇలాంటి పథకం కానీ, విద్యా వ్యవస్థలో మార్పులు కానీ లేవన్నారు. లంచాలకు, వివక్షకు చోటివ్వకుండా ప్రతిభావంతులైన విద్యార్థులకు నిధులు అందిస్తున్నట్లు తెలిపారు. బిడ్డల విదేశీ విద్య కోసం తల్లిదండ్రులు అప్పుల పాలయ్యే పరిస్థితి రాష్ట్రంలో ఉండకూదని చెప్పుకొచ్చారు. అప్లికేషన్ పెట్టుకున్న విద్యార్థుల అర్హతను బట్టి ప్రభుత్వం అండగా ఉంటోందని, విదేశాలలో చదువు పూర్తిచేసుకున్న మన బిడ్డలకు ప్రపంచ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయని చెప్పారు.

గత ప్రభుత్వం విదేశీ విద్యార్థులకు నామమాత్రంగా ఆర్థిక సాయం అందించేదని జగన్ మండిపడ్డారు. కేవలం రూ.10 లక్షలు ఇచ్చి అదే గొప్ప సాయమన్నట్లు చెప్పుకున్నారని తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలలో ఉన్నత చదువులకు దాదాపు రూ.కోటి వరకు ఖర్చవుతోందని, అందులో ఈ పది లక్షలు దేనికి సరిపోతాయని ప్రశ్నించారు. అందుకే తమ ప్రభుత్వం రూ. 1.25 కోట్లు అందజేస్తోందని చెప్పారు. ఫ్లైట్ చార్జీల నుంచి అన్ని ఖర్చులకూ విద్యార్థులను ఆదుకుంటోందని తెలిపారు. గడిచిన ఆరు నెలల్లో విదేశీ విద్యాదీవెన పథకం కింద రూ.65.48 కోట్ల ఆర్థిక సాయం అందించామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.

ఏపీలో 10 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌, మరో మూడు రోజులు భారీ వర్షాలు, ముంచెత్తిన వానతో పొంగిన వాగులు, నీటమునిగిన రహదారులు

అప్లికేషన్‌ పెట్టుకుంటే అన్ని విధాలా సహాయంగా ఉంటున్నాం. ఫీజుల కోసం తల్లిదండ్రులు అప్పులు చేసుకునే పరిస్థితి ఉండొద్దు. విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. అర్హత ఉండి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసమే జగనన్న విదేశీ విద్యాదీవెన. పేదరికంలో ఉండి ఫీజులు కట్టలేని వారికి ఈ స్కీమ్‌ ఉపయోగపడుతుంది. ప్రపంచస్థాయి కాలేజీల్లో మన విద్యార్థులకు అవకాశాలు వస్తున్నాయి. మన విద్యార్థులను మనమే సపోర్టు చేయాలన్నారు.

టాప్‌ 50 యూనివర్సిటీల్లో 21 మంది ఫ్యాకల్టీలను ఎంపిక చేశాం. గతంలో కేవలం రూ.10లక్షలు మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు రూ.1.25కోట్ల వరకు ఇస్తున్నాం. గతంలో మొక్కుబడిగా ఇచ్చిన పరిస్థితి ఉండేది. మన ప్రభుత్వం వచ్చాక కోటి రూపాయలు దాటినా ఇస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు రూ.1.25 కోట్ల వరకు ఇస్తున్నామని వెల్లడించారు.

క్యూఎస్‌ వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్, టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ర్యాంకింగ్స్‌ ప్రకారం ఇంజనీరింగ్, మెడిసిన్, లా, జర్నలిజం తదితర 21 ఫ్యాకల్టీల్లో టాప్‌ 50 ర్యాంకుల్లోని విదేశీ కళాశాలల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. దీని ద్వారా ప్రపంచంలోని 320కి పైగా ఉత్తమ కళాశాలల్లో ఉచితంగా చదువుకొనేందుకు మన రాష్ట్ర విద్యార్థులకు అవకాశం కలుగుతుంది. గడచిన 6 నెలల్లో ‘జగనన్న విదేశీ విద్యా దీవెన‘ కింద అందించిన ఆర్థిక సాయం రూ.65.48 కోట్లు.

(The above story first appeared on LatestLY on Jul 27, 2023 01:14 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).