Jagananna Videshi Vidya Deevena: జగనన్న విదేశీ విద్యాదీవెన, అర్హులైన 390 మంది విద్యార్థులకు రూ.41.59 కోట్లు విడుదల చేసిన సీఎం జగన్, ఆయన ఏమన్నారంటే..

జగనన్న విదేశీ విద్యాదీవెన, సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహక నిధులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM Jagan Mohan Reddy) బుధవారం విడుదల చేశారు. అర్హులైన 390 మంది విద్యార్థులకు రూ. 41.59 కోట్ల నిధులను.. (Jagananna Videshi Vidya Deevena) సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి జమచేశారు.

Jagananna Videshi Vidya Deevena: జగనన్న విదేశీ విద్యాదీవెన, అర్హులైన 390 మంది విద్యార్థులకు రూ.41.59 కోట్లు విడుదల చేసిన సీఎం జగన్, ఆయన ఏమన్నారంటే..
CM YS Jagan Mohan Reddy (Photo-Twitter/APCMO)

AP CMO Press Meet: జగనన్న విదేశీ విద్యాదీవెన, సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహక నిధులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM Jagan Mohan Reddy) బుధవారం విడుదల చేశారు. అర్హులైన 390 మంది విద్యార్థులకు రూ. 41.59 కోట్ల నిధులను.. (Jagananna Videshi Vidya Deevena) సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి జమచేశారు. వీరిలో సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయిన 95 మందికి లబ్ధి చేకూరనుంది. అదే విధంగా 95 మందిలో తిరిగి మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించిన 11 మంది లబ్ధి పొందనున్నారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. చదువుకునేందుకు పేద విద్యార్ధులు ఇబ్బంది పడకూడదని అన్నారు. పిల్లల చదువుల భారం తల్లిదండ్రులపై పడొద్దని తెలిపారు. పేద విద్యార్థుల చదువులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని అన్నారు. విదేశాల్లో చదవాలనుకునే పేద విద్యార్ధుల కల నెరవేర్చడమే లక్ష్యమని పేర్కొన్నారు.

పేదవాడికి ఖరీదైన వైద్యం కోసం సీఎం జగన్ సంచలన నిర్ణయం, ఆరోగ్య శ్రీ కార్డు పరిమితిని రూ.25 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటన, వైద్యం కోసం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ కిందకు..

పేద, మధ్యతరగతి, వెనుకబడిన కుటుంబాల విద్యార్థుల తలరాత మార్చేందుకే విదేశీ విద్యా దీవెన పథకమని సీఎం జగన్‌ పేర్కొన్నారు. విదేశీ విద్యాదీవెన కింద రాష్ట్రానికి చెందిన పలువురు విద్యార్థులు విదేశాల్లో టాప్‌ యూనివర్సిటీలో చదువుతున్నారని, వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అలాగే ప్రిలిమ్స్‌ పాసైతే లక్ష, మెయిన్స్‌కు క్వాలిఫై అయితే లక్షన్నర ఇస్తున్నామని తెలిపారు. రూ. 8 లక్షల వార్షికాదాయం ఉన్న వారందరికీ జగనన్న విదేశీ విద్యా దీవెన అందుతుందని చెప్పారు.

జగనన్న విదేశీ విద్యా దీవెన, సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాల నిధులు విడుదల సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్ కామెంట్స్.. ‘ అన్ని జిల్లాల నుంచి పార్టిసిపేట్ చేస్తున్న కలెక్టర్లు, పిల్లలు, పిల్లల తల్లిదండ్రులు, ప్రజా ప్రతినిధులు, విదేశీ దీవెన పొందుతూ అక్కడ చదువుతూ వీసీల్లో పాల్గొంటున్న వారందరికీ అభినందనలు. రాష్ట్రంలో ఎవరికైనా కష్టపడి చదివితే మంచి యూనివర్సిటీల్లో సీటు వస్తే ఫీజులు ఎంతైనా మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు, మన తల్లిదండ్రులకు, మనకు ఎటువంటి అప్పు చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం తోడుగా ఉంటుంది, జగనన్న తోడుగా ఉంటాడన్న భరోసా ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తున్నాం.

టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్‌లోగానీ, లేదా క్యూఎస్ ర్యాకింగ్స్‌లో గానీ టాప్ 50 కాలేజీల్లో 21 ఫ్యాకల్టీలు కవర్ చేస్తూ 350 కాలేజీలు.. వీటిలో సీట్లు ఎవరికి వచ్చినా కూడా రాష్ట్రం నుంచి ఎంటైర్ ఫీజు చెల్లిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించిన వారికి రూ.కోటీ 25 లక్షల దాకా, మిగిలిన వారికి రూ.కోటి దాకా తోడుగా నిలబడే కార్యక్రమం జరుగుతోంది. 51 మందికి కొత్తగా అడ్మిషన్లు వచ్చాయి. వారికి ఈ కార్యక్రమం ద్వారా ఫీజులు రూ.9.5 కోట్లు ఇస్తున్నాం

ఇదొక్కటే కాకుండా విదేశాల్లో ఉన్నత విద్య కోసం ఇప్పటి దాకా చదువుతున్న 408 మంది పిల్లలకు, ఈ సీజన్ లో ఫీజులు చెల్లించాల్సిన 390 మందికి వాళ్ల ఫీజు కలుపుకుంటే రూ.41.59 కోట్లు ఇస్తున్నాం. దాదాపుగా రూ.107 కోట్లు 408 మంది పిల్లల కోసం ఈ పథకం పెట్టినప్పటి నుంచి ఖర్చు చేస్తున్నాం. ఈ పథకం ఎంత సంతృప్తినిస్తుందంటే.. ఇదొక యాస్పిరేషన్. మిమ్మల్ని చూసి మిగిలిన వాళ్లు స్పూర్తి పొంది, టాప్ కాలేజీలలో సీట్లు తెచ్చుకొని మీ తలరాతలు మారడానికి ఉపయోగపడాలి.

ఎక్కడో ఒక చోట కెరీర్‌లో గొప్పగా ఎదిగిన తర్వాత.. ఈ తరహా సాయం రాష్ట్ర ప్రభుత్వం మీకు అందించిందో.. అది ఎక్కడో ఒక చోట మన రాష్ట్రానికి కూడా కొంత కాంట్రిబ్యూషన్ ఇవ్వగలగాలి. మంచి సీఈవోలుగా పెద్ద పేరు తెచ్చుకుంటే రాష్ట్రాన్ని గుర్తు పెట్టుకొని మన పిల్లలకు మీరు మంచి చేయాలన్నదే మా తాపత్రయం అని సీఎం జగన్ తెలిపారు.

(The above story first appeared on LatestLY on Dec 20, 2023 02:25 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).