KA Paul on AP Politics: ఏపీ ప్రజలు నన్ను సీఎంగా చూస్తుంటే మీడియా మాత్రం కామెడీ చేస్తోంది, కెఎ పాల్ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావణకాష్టంగా మారిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (Prashanti party Chief KA Paul) వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలు తాను సీఎం కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. కానీ మీడియా తనను ఓ కామెడీలా చూపిస్తోందని వాపోయారు.

KA Paul on AP Politics: ఏపీ ప్రజలు నన్ను సీఎంగా చూస్తుంటే మీడియా మాత్రం కామెడీ చేస్తోంది, కెఎ పాల్ సంచలన వ్యాఖ్యలు
KA Paul (Photo-Twitter)

Vjy, June 23: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావణకాష్టంగా మారిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (Prashanti party Chief KA Paul) వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలు తాను సీఎం కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. కానీ మీడియా తనను ఓ కామెడీలా చూపిస్తోందని వాపోయారు. శుక్రవారం మీడియాతో పాల్ మాట్లాడుతూ.. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డిని కలవడానికి వెళ్లానని.. కానీ ఆయన అక్కడ లేరని చెప్పారు.

ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి విడుదల చేసిన ఆడియో చూసి షాక్ అయ్యా. ఆయన్ను కలవడానికి వెళ్లా. ఆయన అక్కడ లేరు. ధర్మవరంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు, దాడులు, దోపిడీలు దారుణం. ధర్మవరంలో జనాలు ‘కేతిరెడ్డి వద్దు.. బాబు వద్దు.. మీరు సీఎం కావాలి’’ అని అంటున్నారు’’ అని చెప్పుకొచ్చారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లా 100 మంది బౌన్సర్లతో, చంద్రబాబులా హై సెక్యూరిటీతో తిరగడంలేదని, సింగిల్‌గా వెళ్తున్నానని అన్నారు. 15 సీట్లకు పవన్ కల్యాణ్ అమ్ముడుపోయారని, దమ్ముంటే 175 స్థానాల్లో పోటీ చెయ్యాలని సవాల్ చేశారు. తన ప్రజాశాంతి పార్టీలోకి పవన్ పార్టీని విలీనం చెయ్యాలన్నారు. పవన్ ఓ ప్యాకేజీ స్టార్ అని మండిపడ్డారు.

ఏ ఒక్కరూ పథకం అందలేదని చెప్పకూడదు, జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభోత్సవంలో సీఎం జగన్

కొన్ని మీడియా సంస్థలు తనను ఓ కామెడీలా చూపిస్తున్నాయని కేఏ పాల్ మండిపడ్డారు. అదానీ, అంబానీలతో నార్త్ మీడియాను ప్రధాని మోదీ కొనేశారని ఆరోపించారు. షర్మిల పార్టీ కాంగ్రెస్‌లో విలీనం, పవన్ కల్యాణ్ పార్టీ టీడీపీ, బీజేపీలతో విలీనం అన్నారు. ధర్మవరంలో జనాలను చూసి షాక్ అయ్యానని, తాను సీఎం కావాలని అన్నారని చెప్పారు. 100 వాగ్దానాలు చేసిన చంద్రబాబు ఒక్కటి కూడా నెరవేర్చలేదని విమర్శలు చేశారు.

గోచీ, మొలతాడు లేనివాళ్లతో తిట్టించడం మగతనం కాదు, పవన్ కళ్యాణ్‌పై లేఖలో మరోసారి విరుచుకుపడిన ముద్రగడ పద్మనాభం

‘చంద్రబాబు.. దమ్ముంటే నాతో డెబిట్‌కు రా.. ఎలాగూ లోకేష్‌కు మాట్లాడడం రాదు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర వదిలేసి లోకేష్ కోసం నారాహి యాత్ర చేస్తున్నాడు. మాటలు రాని పప్పును సీఎం చెయ్యడానికి చంద్రబాబు అవస్థలు. 15 సీట్లకు పవన్ కళ్యాణ్ అమ్ముడుపోయాడు.. దమ్ము ఉంటే 175 స్థానాల్లో పోటీ చెయ్యి. పవన్ కళ్యాణ్.. ప్రజాశాంతి పార్టీలోకి నీ పార్టీని విలీనం చెయ్యి. 2008లో పార్టీ పెట్టిన చిరంజీవి వెంట వెళ్లిన బీసీ, ఎస్సీ, ఎస్టీలు కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయారు’’ అని విమర్శించారు. పవన్ కళ్యాణ్ ఓ ప్యాకేజి స్టార్ అని అన్నారు. ఆదాని, అంబానీలతో నార్త్ మీడియాను మోడీ కొనేశారని ఆరోపించారు. షర్మిల కాంగ్రెస్‌లో విలీనం, పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీలతో విలీనం అంటూ వ్యాఖ్యలు చేశారు.

(The above story first appeared on LatestLY on Jun 23, 2023 03:38 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).