Night Curfew In AP: ఏపీలో నైట్‌ కర్ఫ్యూ, రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు, మాస్క్‌ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు

ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అలాగే దేశ వ్యాప్తంగా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆందోళన కలిగిస్తోంది.ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో నైట్‌ కర్ఫ్యూ (Night Curfew In AP) విధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Night Curfew In AP: ఏపీలో నైట్‌ కర్ఫ్యూ, రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు, మాస్క్‌ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు
Partial curfew (Photo: PTI)

Amaravati, Jan 10: ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అలాగే దేశ వ్యాప్తంగా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆందోళన కలిగిస్తోంది.ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో నైట్‌ కర్ఫ్యూ (Night Curfew In AP) విధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించింది. దీనిపై త్వరలో వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు జారీ చేయనుంది. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడపాలని, మాస్క్‌ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం (Andhra Pradesh govt) ఆదేశించింది.

కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan) సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. కోవిడ్‌ విస్తరణ, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. దేశవ్యాప్తంగా వైరస్‌ విస్తరిస్తున్న విషయాన్ని అధికారులు వివరించారు. కోవిడ్‌ సోకిన వారికి దాదాపుగా స్వల్ప లక్షణాలు ఉంటున్నాయని అధికారులు తెలిపారు. కోవిడ్‌లో ఒమిక్రాన్‌ లాంటి కొత్త వేరియంట్‌ నేపథ్యంలో మార్పు చేయాల్సిన మందుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు.

ఏపీలో కొత్తగా 144 ఆక్సిజన్‌ ప్లాంట్లు, సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం జగన్, ఆక్సిజన్‌ ప్లాంట్లను జాతికి అంకితం చేస్తున్నామని​ వెల్లడి

ఆ మేరకు హోం కిట్‌లో మార్పులు చేయాలన్నారు. వైద్యనిపుణులతో సంప్రదించి ఇవ్వాల్సిన మందులను సిద్ధంచేయాలన్నారు. అంతేకాక చికిత్సలో వినియోగించే మందుల నిల్వలపై సమీక్ష చేయాలని, అవసరం మేరకు వాటిని కొనుగోలుచేసి సిద్ధంగా ఉంచుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

సీఎం వైఎస్‌ జగన్‌ కోవిడ్ రివ్యూ హైలెట్స్

104 కాల్‌ సెంటర్‌ను బలంగా ఉంచాలి.

ఎవరు కాల్‌చేసినా వెంటనే స్పందించేలా తగిన చర్యలు తీసుకోవాలి.

కోవిడ్‌ కేర్‌ సెంటర్లను కూడా సిద్ధం చేయాలి.

నియోజకవర్గానికి ఒక కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలి.

అక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేసేలా తగిన చర్యలు తీసుకోవాలి.

కోవిడ్‌ నివారణా చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలి.

భౌతిక దూరం పాటించేలా, మాస్క్‌లు కచ్చితంగా ధరించేలా చూడాలి.

మాస్క్‌లు ధరించకపోతే జరిమానాను కొనసాగించాలి.

దుకాణాల్లో, వ్యాపార సముదాయాల్లో కోవిడ్‌ ఆంక్షలు పాటించేలా చూడాలి.

బస్సు ప్రయాణికులు కూడా మాస్క్‌ ధరించేలా చూడాలి.

బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఇన్‌డోర్స్‌లో 100 మంది మించకుండా చూడాలని ఆదేశం

థియేటర్లలో సీటు మార్చి సీటుకు అనుమతించాలని ఆదేశం, మాస్క్‌తప్పనిసరి చేయాలని ఆదేశం

రాత్రి 11 గంటలనుంచి ఉదయం 5 గంటలవరకూ కర్ఫ్యూ ఉంచాలని ఆదేశం

దేవాలయాలు, ప్రార్థనా మందిరాల్లో కూడా భౌతిక దూరం పాటించేలా, మాస్క్‌ ధరించేలా చూడాలి.

ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు విడుదల చేయనుంది.

(The above story first appeared on LatestLY on Jan 10, 2022 03:45 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).