Red Alert for Budameru: ‘బుడమేరు’ పరివాహక ప్రాంతంలో రెడ్ అలర్ట్.. ఏ క్షణమైనా వరద ముంచెత్తే ప్రమాదం.. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని అధికారుల హెచ్చరిక

బుడమేరుకు మరోసారి వరద ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించారు.

Red Alert for Budameru: ‘బుడమేరు’ పరివాహక ప్రాంతంలో రెడ్ అలర్ట్.. ఏ క్షణమైనా వరద ముంచెత్తే ప్రమాదం.. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని అధికారుల హెచ్చరిక
Budameru Vagu River

Vijayawada, Sep 9: బుడమేరుకు (Budameru) మరోసారి వరద ముప్పు పొంచి (AP Floods) ఉందని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించారు. ఈ మేరకు ‘బుడమేరు’ పరివాహక ప్రాంతంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. బుడమేరు పరివాహక ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయని, ఈ వర్షాల కారణంగా బుడమేరుకు ఏ క్షణమైనా వరద ముంచెత్తే ప్రమాదం ఉందని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చెప్పారు. ఈ క్రమంలో బుడమేరు పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటిస్తున్నట్టు సోమవారం ఉదయం వెల్లడించారు.

ఉత్తరాంధ్రలో ఎడతెరిపి లేని వానలు.. పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు.. నేడు విద్యాసంస్థలకు సెలవు

వీళ్లు జాగ్రత్త

గుణదల, సింగ్‌ నగర్ పరిసర ప్రాంతాల ప్రజలందరూ వెంటనే సురక్షితమైన ప్రదేశాలకు తరలివెళ్లాలని ధ్యానచంద్ర ఆదేశించారు. ప్రజలకు అవసరమైన సాయాన్ని అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.

ఇళ్ల స్థలాల విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దు.. అర్హులైన వారిని ఫ్యూచర్ సిటీలో భాగస్వాములను చేస్తాం

(The above story first appeared on LatestLY on Sep 09, 2024 10:36 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).