Skill Development Scam: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసు, రాజమండ్రి జైల్లో చంద్రబాబును విచారిస్తున్న సీఐడీ అధికారులు, హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన టీడీపీ అధినేత
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్కిల్ కేసులో క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో చంద్రబాబు తరఫు న్యాయవాదులు పిటిషన్ వేశారు. తనపై ఏసీబీ కోర్టు ఇచ్చిన రిమాండ్‌ను క్వాష్ చేయాలని పిటిషన్‌లో చంద్రబాబు కోరారు.
Vjy, Sep 23: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్కిల్ కేసులో క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో చంద్రబాబు తరఫు న్యాయవాదులు పిటిషన్ వేశారు. తనపై ఏసీబీ కోర్టు ఇచ్చిన రిమాండ్‌ను క్వాష్ చేయాలని పిటిషన్‌లో చంద్రబాబు కోరారు. సోమవారం ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి ఎదుట ప్రత్యేకంగా మెన్షన్ చేసి.. వెంటనే విచారణ చేపట్టాలని కోరే అవకాశం ఉంది. దర్యాప్తు తుది దశలో ఉన్నందున కేసులో జోక్యం చేసుకోలేమంటూ చంద్రబాబు క్వాష్ పిటిషన్ హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును,,సిఐడి డీఎస్పీ ధనుంజయుడు ఆధ్వర్యంలో అధికారులు విచారిస్తున్నారు. రాజమహేంద్రవరం జైలులోనే అధికారులు విచారణ చేపట్టారు. 12 మంది సభ్యుల సీఐడీ బృందం ఆయన్ను విచారిస్తోంది. చంద్రబాబు తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ సమక్షంలో ఈ విచారణ కొనసాగుతోంది. చంద్రబాబును ప్రశ్నించేందుకు కాన్ఫరెన్స్ హాల్‌ను జైలు అధికారులు సిద్ధం చేశారు. విచారణకు ముందు చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
చంద్రబాబును రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి ఇస్తూ విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం శుక్రవారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండులో ఉన్న చంద్రబాబును రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం ప్రాంగణంలోనే విచారించాలని కోర్టు సూచించింది. శని, ఆదివారాలు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యే విచారించాలని, గంటకోసారి అయిదు నిమిషాల విరామమిచ్చి న్యాయవాదిని సంప్రదించుకునేందుకు అవకాశమివ్వాలని పేర్కొంది.
ఈ మేరకు ఏసీబీ న్యాయస్థానం న్యాయాధికారి హిమబిందు ఆదేశాలిచ్చారు. చంద్రబాబుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించరాదని, ఎలాంటి తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేశారు. కస్టడీకి తీసుకునే ముందు, కస్టడీ ముగిసిన తర్వాత ఆయనకు తప్పనిసరిగా వైద్యపరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. విచారణను సీఐడీకి చెందిన వీడియోగ్రాఫర్‌తో మాత్రమే రికార్డు చేయించాలని, ఆ వీడియో మొత్తాన్ని సీల్డ్‌కవర్‌లో న్యాయస్థానానికి సమర్పించాలని పేర్కొన్నారు.
(The above story first appeared on LatestLY on Sep 23, 2023 01:06 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

