Stone Pelted On Pawan Kalyan: నిన్న జగన్, ఇవాళ పవన్ కల్యాణ్! జనసేన అధినేత పవన్ పై రాయి విసిరిన ఆగంతకుడు, పట్టుకొని పోలీసులకు అప్పగించిన జనసైనికులు
ఓ దుండగుడు పవన్ కల్యాణ్‌పై రాయి విసిరారు. అయితే ఆ రాయి పవన్‌కు తగలకుండా సమీపంలో పడింది. వెంటనే అప్రమత్తమైన జన సైనికులు రాయి విసిరిన వ్యక్తిని పట్టుకున్నారు. అక్కడే పోలీసులు బందోబస్తు ఉండటంతో వారికి అప్పగించారు.
Tenali, April 14: ఏపీ సీఎం జగన్‌పై (Stone pelt) దాడి ఘటన మరవకముందే.. అలాంటిదే మరో ఘటన జరిగింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై (Pawan Kalyan) కూడా ఓ ఆగంతుకుడు రాయి విసిరాడు. అదృష్టవశాత్తూ రాయి దూరంగా పడటంతో పెను ప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర (Varahi Yatra) ఆదివారం నాడు తెనాలికి చేరుకుంది. ఈ సందర్భంగా వారాహి విజయభేరి బహిరంగ సభకు వేలాదిగా జనం తరలివచ్చారు.
తెనాలిలో పవన్ కళ్యాణ్ పైన రాయి తో దాడి చేసిన దుండగుడు . అతన్ని పట్టుకుని పోలీస్ లకి అప్పజెప్పిన జనసేన కార్యకర్తలు.#PawanKalyan
— SatishK_FilmyBowl (@SatishKTweets) April 14, 2024
ఈ క్రమంలో పవన్ కల్యాణ్ యాత్ర కొనసాగుతుండగా.. ఓ దుండగుడు పవన్ కల్యాణ్‌పై రాయి విసిరారు. అయితే ఆ రాయి పవన్‌కు తగలకుండా సమీపంలో పడింది. వెంటనే అప్రమత్తమైన జన సైనికులు రాయి విసిరిన వ్యక్తిని పట్టుకున్నారు. అక్కడే పోలీసులు బందోబస్తు ఉండటంతో వారికి అప్పగించారు.
(The above story first appeared on LatestLY on Apr 14, 2024 07:47 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

