COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 7,813 పాజిటివ్ కేసులు నమోదు, ఒక్కరోజులోనే మరో 52 మంది మృతి, రాష్ట్రంలో 90 వేలకు చేరువైన కొవిడ్ బాధితుల సంఖ్య
వైరస్ నిర్ధారణ పరీక్షల్లో ముందున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గడిచిన ఒక్కరోజులో కూడా భారీ స్థాయిలో 56,681 మంది శాంపుల్స్ పరీక్షించినట్లు తెలిపింది. ఈరోజు వరకు సుమారుగా 16 లక్షల మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది....
Amaravati, July 25: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి రికార్డ్ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా మరో 7,813 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 88,671 కు చేరింది. అయితే ఇందులో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి మినహాయించి, కేవలం ఏపీ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 85,776 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
అయితే ఇటీవల కాలంగా రాష్ట్రంలో 50కి పైబడి కరోనా మరణాలు నమోదవడం ఆందోళన కలిగిస్తుంది. గడిచిన ఒక్కరోజులోనే మరో 52 మంది కరోనాతో పోరాడి ఓడిపోయారు. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 985కు పెరిగింది.
AP COVID19 Report:

మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 3,028 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 43,255 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 44,431 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
ఇక ఇప్పటికే వైరస్ నిర్ధారణ పరీక్షల్లో ముందున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గడిచిన ఒక్కరోజులో కూడా భారీ స్థాయిలో 56,681 మంది శాంపుల్స్ పరీక్షించినట్లు తెలిపింది. ఈరోజు వరకు సుమారుగా 16 లక్షల మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
(The above story first appeared on LatestLY on Jul 25, 2020 07:13 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

