Divya Vani Resigns Row: టీడీపీకి దివ్యవాణి రాజీనామా, వెంటనే వెనక్కి తగ్గిన సీనియర్ నేత, మహానాడులో ఘోర అవమానం జరిగిందని ఆవేదన
తెలుగుదేశం పార్టీకి సీనియర్ నేత, అధికార ప్రతినిధి దివ్యవాణి షాక్ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు దివ్యవాణి ప్రకటించారు. పార్టీలో దుష్టశక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఇంతవరకు తనను ఆదరించిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు.
తెలుగుదేశం పార్టీకి సీనియర్ నేత, అధికార ప్రతినిధి దివ్యవాణి షాక్ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు దివ్యవాణి ప్రకటించారు. పార్టీలో దుష్టశక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఇంతవరకు తనను ఆదరించిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. మహానాడులో అవమానం జరిగినట్లు రెండు రోజుల కిందట ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
పార్టీ మహానాడులో తనకు ఘోర అవమానం జరిగిందని.. కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని దివ్యవాణి ఆరోపించారు. పార్టీకి నిస్వార్థంగా సేవ చేస్తున్నా గుర్తింపే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ కళాకారుడు (దివంగత ఎన్‌టీఆర్) పెట్టిన పార్టీలో కళాకారులకు స్థానం లేకపోవడం తనని ఆవేదనకు గురి చేస్తోందన్నారు. ఈ క్రమంలో మంగళవారం దివ్యవాణి అనూహ్యంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.అయితే ఈ వ్యవహారం పార్టీ నాయకత్వం దృష్టికి వెళ్లడంతో కొందరు ఆమెను బుజ్జగించినట్లు సమాచారం. దీంతో ఆమె వెంటనే రాజీనామాపై వెనక్కి తగ్గింది. రాత్రి పెట్టిన ట్వీట్ వెంటనే డిలీట్ చేసింది.
(The above story first appeared on LatestLY on May 31, 2022 04:19 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

